ప్రభుత్వ విభాగాల లో మరియు సంస్థల లో కొత్త గా నియామకం జరిగిన వ్యక్తుల కు దాదాపు గా 71,000 నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా అందించారు. ఉపాధి కల్పన కు అగ్రతాంబూలాన్ని కట్టబెట్టాలి అనేటటువంటి ప్రధాన మంత్రి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక ముందంజ గా ఉంది. ఈ రోజ్ గార్ మేళా ఉపాధి కల్పన ను మరింత గా వృద్ధి చెందింప చేయడం లో ఒక ఉత్ప్రేరకం గా మారగలదని, యువత ను సశక్తం చేసి దేశ నిర్మాణం లో వారి కి ప్రాతినిధ్యం లభించేందుకు సార్థక అవకాశాల ను అందించగలదన్న ఆశలు రేకెత్తుతున్నాయి.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ఉద్యోగం లో నియామకం జరిగిన వారితో మాట్లాడారు.
పంజాబ్ నేశనల్ బ్యాంక్ లో ఉద్యోగ నియామక లేఖ ను అందుకొన్న పశ్చిమ బెంగాల్ కు చెందిన సుప్రభ బిశ్వాస్ గారు మొదటగా ప్రధాన మంత్రి తో సంభాషించారు. నియామకం సంబంధి లాంఛనాల ను శీఘ్రం గా పూర్తి చేసి ప్రజల కు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆమె ప్రధాన మంత్రి కి ధన్యవాదాల ను తెలియ జేశారు. ఆమె చదువుకోవడాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారా అని ఆమె ను ప్రధాన మంత్రి అడిగారు. ఐజిఒటి మాడ్యూల్ తో తన కు ఉన్న అనుబంధాన్ని గురించి ఆమె వివరిస్తూ, ఈ మాడ్యూల్ వల్ల కలిగే ప్రయోజనాన్ని గురించి ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు. ఉద్యోగ నిర్వహణ లో భాగం గా డిజిటల్ లావాదేవీల ను ప్రోత్సహిస్తున్నారా అని కూడా ఆమె ను శ్రీ నరేంద్ర మోదీ అడిగారు. అమ్మాయిలు ప్రతి ఒక్క రంగం లో ముందంజలు వేస్తుండడం పట్ల ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఎన్ఐటి శ్రీనగర్ లో ఓ జూనియర్ అసిస్టెంట్ గా జమ్ము, కశ్మీర్ లోని శ్రీనగర్ కు చెందిన శ్రీ ఫైజల్ శౌకత్ శాహ్ కు నియామకం లభించింది. ఆయన ప్రధాన మంత్రి తో మాట్లాడుతూ, తమ కుటుంబం లో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని దక్కించుకొన్న మొదటి సభ్యుడి ని తానే అనే సంగతి ని తెలియ జేశారు. ఆయన కు ఉద్యోగం రావడం ఆయన తోటివారి మీద చూపించినటువంటి ప్రభావాన్ని గురించి ప్రధాన మంత్రి వాకబు చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం లో చేరాలి అనేటటువంటి ప్రేరణ ను తన స్నేహితులు పొందారని శ్రీ ఫైజల్ ప్రధాన మంత్రి కి చెప్పారు. ఐజిఒటి మాడ్యూల్ వల్ల కలిగే ప్రయోజనాల ను గురించి కూడా శ్రీ ఫైజల్ తెలియ జేశారు. ఫైజల్ వంటి యువ ప్రతినిధుల ద్వారా జమ్ము, కశ్మీర్ కొత్త శిఖరాల ను చేరుకోగలుగుతుందని తాను నమ్ముతున్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు. మీరు విషయాల ను నేర్చుకొంటూ ఉండడాన్ని కొనసాగించండి అని యువ ఉద్యోగి కి ఆయన సూచించారు.
మణిపుర్ కు చెందిన వహ్ని చోంగ్ ఎఐఐఎమ్ఎస్ గువాహాటి లో ఒక నర్సింగ్ ఆఫీసర్ గా తన నియామక లేఖ ను అందుకొన్నారు. దేశ ఈశాన్య ప్రాంతం లో ఆరోగ్య రంగం లో పని చేయాలి అనేది తన స్వప్నం అని ఆమె అన్నారు. ఆమె కుటుంబం లో కూడాను ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందినటువంటి ప్రథమ వ్యక్తి వహ్ని చోంగ్ యే. ఎంపిక ప్రక్రియ లో ఆమె ఏవైనా అడ్డంకుల ను ఎదుర్కొన్నారా అంటూ ప్రధాన మంత్రి అడిగారు. ఆమె కు ఎదురైన అనుభవం గురించి కూడా వెల్లడించవలసింది అని ఆయన అన్నారు. ఆమె తాను కూడా మరిన్ని విషయాల ను నేర్చుకోవాలని అనుకొంటున్నట్లు తెలియ జేశారు. పని ప్రదేశం లో ఎలా ప్రవర్తించాలో అనేది గుర్తెరగడం తో పాటు లైంగిక వేధింపుల కు సంబంధించిన నియమావళి ని గురించి తాను తెలుసుకోవాలనుకొంటున్న సంగతి ని ఆమె ప్రస్తావించారు. దేశ ఈశాన్య ప్రాంతం లో నియామకాన్ని ఆమె సాధించినందుకు గాను ప్రధాన మంత్రి ఆమె కు అభినందనల ను తెలియజేసి, ఆ ప్రాంతం అభివృద్ధి కి ప్రభుత్వం కంకణం కట్టుకొన్నదని చెప్పారు.
ఇండియన్ ఈస్టర్న్ రైల్ వేస్ లో ఓ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాని కి సంబంధించిన నియామక లేఖ ను బిహార్ కు చెందిన ఒక దివ్యాంగుడు శ్రీ రాజు కుమార్ అందుకొన్నారు. శ్రీ రాజు తన జీవన యాత్ర గురించి క్లుప్తం గా వివరించడం తో పాటు తాను మరింత ముందుకు పోవాలనుకొంటున్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల వద్ద నుండి, తన సహచరుల వద్ద నుండి తాను అందుకొన్న సమర్థన ను గురించి కూడా ఆయన వివరించారు. కర్మయోగి ప్రారంభ్ కోర్సు కు సంబంధించి తాను ఇప్పటికే కొంత పురోగతి ని సాధించినట్లు, స్ట్రెస్ మేనేజ్ మెంట్ కు, కోడ్ ఆఫ్ కాండక్ట్ కు సంబంధించిన అంశాల లో తనకు అమిత ప్రయోజనం సిద్ధించినట్లు శ్రీ రాజు వివరించారు. యుపిఎస్ సి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ను తాను రాయాలనుకొంటున్నట్లు ప్రధాన మంత్రి కి ఆయన తెలియ జేశారు. ఆయన జీవన యాత్ర లో రాణించాలి అంటూ ఆయన కు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను తెలియ జేశారు.
కోల్ ఇండియా లిమిటెడ్ లో ఒక మేనేజ్ మెంట్ ట్రైనీ గా ఉద్యోగ నియామక లేఖ ను తెలంగాణ కు చెందిన శ్రీ కన్నామల వంశీ కృష్ణ అందుకొన్నారు. శ్రీ వంశీ కృష్ణ తల్లితండ్రులు పడ్డ కష్టాల ను గురించి మరియు వారి యొక్క కఠోర శ్రమ ను గురించి ప్రధాన మంత్రి తెలుసుకొన్నారు. దీనితో పాటుగా శ్రీ వంశీ కృష్ణ ఇంతవరకు సాగిన తన జీవన యాత్ర ను గురించి ఒక సారి గుర్తు చేసుకొంటూ రోజ్ గార్ మేళా నిర్వహణకు గాను ప్రధాన మంత్రి కి ధన్యవాదాల ను తెలియ జేశారు. ఐజిఒటి మాడ్యూల్ మొబైల్ ఫోన్ లలో అందుబాటు లో ఉన్నందువల్ల చాలా ఉపయోగకరం గా ఉంది అని కూడా శ్రీ వంశీ కృష్ణ చెప్పారు. ఆయన కు భావి జీవనం చక్క గా సాగాలి అని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తూ, ఆయన వృత్తి జీవనం లో మరిన్ని విషయాల ను నేర్చుకొంటూ ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 2023 వ సంవత్సరం లో ఇది ఒకటో రోజ్ గార్ మేళా అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగం తాలూకు విలువైన బహుమతి ని 71,000 కుటుంబాల ను అందిస్తోందని ఆయన అన్నారు. కొత్త గా నియామకం జరిగిన వారి ని ప్రధాన మంత్రి అభినందిస్తూ, ఈ ఉద్యోగ అవకాశాలు వారి కి ఒక కొత్త ఆశా కిరణం గా నిలవడమే కాకుండా కోట్ల కొద్దీ కుటుంబాల కు సంతోషాన్ని కూడా ఇస్తాయన్నారు. ఎన్ డిఎ పాలన లో ఉన్న రాష్ట్రాల లో మరియు కేంద్రపాలిత ప్రాంతాల లో రోజ్ గార్ మేళాల ను క్రమం తప్పక నిర్వహించడం జరుగుతోందని, కాబట్టి రాబోయే రోజుల లో లక్షల కొద్దీ కొత్త కుటుంబాలు ప్రభుత్వ కొలువుల తాలూకు అవకాశాల ను అందుకొంటాయని ప్రధాన మంత్రి అన్నారు. అసమ్ ప్రభుత్వం నిన్నటి రోజు న ఒక రోజ్ గార్ మేళా ను నిర్వహించిందని, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర మరియు ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని అతి త్వరలో ఏర్పాటు చేయనున్నాయని ఆయన వెల్లడించారు. ‘‘క్రమం తప్పకుండా రోజ్ గార్ మేళాల ను ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ముద్ర గా మారిపోయింది. ఈ ప్రభుత్వం తీసుకొన్న సంకల్పం ఏదైననప్పటికీ దాని ని ఆచరణ లోకి తీసుకు రావడం జరుగుతుంది అని ఈ ఈ మేళా ల నిర్వహణ చాటి చెప్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
కొత్త గా నియామకం జరిగిన వ్యక్తుల ముఖాల లో సంతోషాన్ని మరియు సంతృప్తి ని తాను స్పష్టం గా చూడగలుగుతున్నానని; అంతేకాకుండా, ఈ అభ్యర్థుల లో చాలా మంది సామాన్య నేపథ్యాల నుండి వచ్చిన వారేనని, అంతేకాక వారి యొక్క కుటుంబాల లో వెనుకటి అయిదు తరాల లో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించిన మొదటి వ్యక్తులంటూ ఎంతో మంది కూడా ఉన్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది ఒక ప్రభుత్వ నౌకరీ ని చేజిక్కించుకోవడాని కంటే మిన్న అయినటువంటి విషయం అని ప్రధాన మంత్రి అన్నారు. పారదర్శకమైనటువంటి మరియు స్పష్టమైనటువంటి భర్తీ ప్రక్రియ ద్వారా అభ్యర్థుల యోగ్యత కు గౌరవం లభించినందుకు కూడాను వారు ఆనందం గా ఉన్నారు అని ఆయన అన్నారు. ‘‘నియామకం ప్రక్రియ లో పెద్ద ఎత్తున చోటు చేసుకొన్న మార్పు ను మీరు తప్పక గమనించే ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకం ప్రక్రియ మునుపటితో పోలిస్తే మరింత సరళం, కాలబద్ధం అయింది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం నియామకం సంబంధి ప్రక్రియ లో పారదర్శకత్వం మరియు వేగం అనేవి ఇప్పటి ప్రభుత్వ పనితీరు లో ప్రతి ఒక్క అంశాని కి నిదర్శనం గా నిలుస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. నియమిత రీతి న జరగవలసిన పదోన్నతుల లో కూడాను వివాదాల లో చిక్కుకొన్నటువంటి మరియు జాప్యం బారిన పడ్డ టువంటి కాలం అంటూ ఒకటి ఉండింది అని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు. అటువంటి సమస్యల ను ఈ ప్రభుత్వం పరిష్కరించి, మరి ఒక పారదర్శకమైన ప్రక్రియ కు పూచీపడింది అని ఆయన అన్నారు. ‘‘పారదర్శకమైనటువంటి నియామకం మరియు పదోన్నతి అనేవి యువతీ యువకుల లో ఒక భరోసా ను అంకురింప చేస్తాయి’’ అని ఆయన అన్నారు.
ఈ రోజు న నియామక లేఖల ను అందుకొన్న వ్యక్తుల కు ఇది ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టడం వంటిది అని ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, ప్రభుత్వ యంత్రాంగం లో ఒక భాగం కావడం ద్వారా దేశం యొక్క అభివృద్ధి ప్రస్థానం లో వారి తోడ్పాటు మరియు వారి భాగస్వామ్యం ఎటువంటిది కాగలదో ఆయన నొక్కిచెప్పారు. కొత్త గా నియమితులు అయిన వారి లో చాలా మంది ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష ప్రతినిధులు గా సాధారణ ప్రజానీకం తో మమేకం అవుతారని, వారు వారివైన సొంత పద్ధతుల లో ఒక ప్రభావాన్ని ఏర్పరచ గలుగుతారని ఆయన అన్నారు. వినియోగదారుడు ఎప్పటికీ సరి అయిన వ్యక్తే అనేది వ్యాపార జగతి లోను, పరిశ్రమ లోను ప్రసిద్ధి చెందిన నానుడి అని ప్రధాన మంత్రి తెలుపుతూ, పరిపాలన లో సైతం ‘పౌరుడు ఎప్పటికీ సరి అయిన వ్యక్తి’ అనే ఒక మంత్రాన్ని అమలు లోకి తీసుకు రావాలి అని వ్యాఖ్యానించారు. ‘‘ఇది సేవ భావన ను ప్రోది చేస్తుంది. అంతేకాదు, ఆ యొక్క భావన ను బలపరుస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి ప్రభుత్వం లో నియామకాన్ని పొందారు అంటే గనుక, అప్పుడు దానిని ప్రభుత్వ సేవ గా పేర్కొంటారే తప్ప అది ఒక ఉద్యోగం గా ఎంచరు అని ప్రధాన మంత్రి చెప్పారు. 140 కోట్ల మంది భారతీయ పౌరుల కు సేవ చేయడం ద్వారా లభించేటటువంటి ఆనందాన్ని గురించి కూడా ఆయన ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ఇది ప్రజల పై ఒక సానుకూల ప్రభావాన్ని ప్రసరింప చేస్తుంది అన్నారు.
ఐజిఒటి కర్మయోగి ప్లాట్ ఫార్మ్ ద్వారా అందుబాటు లో ఉన్న ఆన్ లైన్ కోర్సుల ను అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అనుసరించడాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఆధికారిక శిక్షణ కు అదనం గా ఈ వేదిక లో వ్యక్తిగత పురోగతి కి ఎన్నో కోర్సు లు లభిస్తున్నాయి అన్నారు. సాంకేతిక విజ్ఞానం ద్వారా స్వయం గా నేర్చుకోవడం అనేది నేటి తరాని కి లభించిన ఒక అవకాశం అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి తన సొంత ఉదాహరణ ను చెప్తూ, తాను తన లోపలి విద్యార్థి ని ఎన్నడు మరణించనీయ లేదని తెలిపారు. ‘‘మనకు మనమే నేర్చుకోవాలి అనేటటువంటి వైఖరి నేర్చుకొనే వ్యక్తి యొక్క సామర్థ్యాల ను మెరుగు పరుస్తుంది; అంతేకాకుండా, ఈ మార్గం లో భారతదేశం యొక్క శక్తియుక్తులు కూడా పటిష్టం అవుతాయి’’ అని ఆయన అన్నారు.
‘‘త్వరిత గతి న పరివర్తన చెందుతున్న భారతదేశం లో ఉద్యోగ అవకాశాల తో పాటు స్వతంత్రోపాధి అవకాశాలు కూడా నిరంతరాయం గా మెరుగు పడుతున్నాయి. స్వతంత్రోపాధి అవకాశాలు భారీ ఎత్తున విస్తరించడానికి శీఘ్ర వృద్ధి బాట ను పరుస్తుంది. ప్రస్తుతం ఈ పరిణామానికి సాక్షీ భూతం గా భారతదేశం ఉంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
దేశం లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కి ఒక సమగ్రమైన దృక్పథాన్ని కలిగి ఉంటూ, గత ఎనిమిది సంవత్సరాల లో లక్షల కొద్దీ ఉద్యోగ అవకాశాల ను సృష్టించడం జరిగిందని ప్రధాన మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాల రంగం లో ఒక వంద లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ని ఒక ఉదాహరణ గా ఆయన చెప్తూ, నూతనం గా నిర్మించిన రహదారి తో, రైలు మార్గం తో ఏదైనా ప్రదేశం జతపడిందా అంటే గనక ఆయా దోవల లో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి అని స్పష్టం చేశారు. కొత్త రహదారుల వెంబడి కొత్త బజారు లు వెలుస్తాయి. మరి అవి వ్యవసాయ క్షేత్రం నుండి ఆహార ధాన్యాల రవాణా ను ఎంతో సులభతరం గా మార్చివేస్తూ, పర్యటన రంగాని కి కూడాను ఊతాన్ని అందిస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఈ అవకాశాలు అన్నీ కూడా ఉపాధి కి దన్ను గా నిలుస్తాయి’’ అని ఆయన అన్నారు.
ప్రతి గ్రామాని కి బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ ని సమకూర్చే భారత్-నెట్ ప్రాజెక్టు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ కనెక్టివిటీ సాకారం అయినప్పుడు ఉపాధి తాలూకు నూతన అవకాశాలు అందివస్తాయి అని పేర్కొన్నారు. సాంకేతిక పరం గా చూసినప్పుడు ఏమంత పరిజ్ఞానం లేని వారు సైతం దీని యొక్క లాభాల ను తెలుసుకోగలుగుతారు అని ఆయన అన్నారు. ఇది పల్లెల లో ఆన్ లైన్ సర్వీసుల ను అందించడం ద్వారా నవ పారిశ్రామికత్వం తాలూకు ఒక కొత్త తలుపు ను తెరచింది అని ఆయన అన్నారు. రెండో అంచె నగరాల లో, మూడో అంచె నగరాల లో స్టార్ట్-అప్ ముఖచిత్రం విస్తృతం కావడాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, ఈ సాఫల్యం ప్రపంచం లో యువత కు ఒక కొత్త గుర్తింపు ను తెచ్చిపెట్టిందన్నారు.
నియామకాలు జరిగిన వ్యక్తుల యొక్క జీవన యాత్ర మరియు వారి ప్రయాసల ను ప్రధాన మంత్రి కొనియాడుతూ, దేశ ప్రజల కు సేవ చేసే అవకాశాన్ని పొందినందుకు వారి కి అభినందనల ను తెలియ జేశారు. వారి ని ఇక్కడ కు తీసుకు వచ్చిన సంగతి ఏది అన్నదానిని వారు జ్ఞాపకం పెట్టుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు, వారు నేర్చుకోవడాన్ని కొనసాగిస్తూ ఉండాలని, ప్రజల కు సేవల ను అందిస్తూనే ఉండాలని ఆయన సూచించారు. ‘‘ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మీరు నేర్చుకొంటూ ఉండవలసిందే, అంతేకాకుండా మిమ్మల్ని మీరు దక్షులు గా తీర్చిదిద్దుకోవలసిందే’’ అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
పూర్వరంగం
ఉపాధి కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలన్న ప్రధాన మంత్రి వాగ్దానాన్ని నెరవేర్చే దిశ లో వేసిన ఒక అడుగు గా రోజ్ గార్ మేళా ఉంది. ఉపాధి కల్పన ను పెంపొందింప చేయడం లో ఒక ఉత్ప్రేరకం గా ఈ రోజ్ గార్ మేళా పని చేయగలదన్న ఆశ ఉంది. అంతేకాక యువత కు ఉపాధి కల్పన అవకాశాల ను మరియు దేశ నిర్మాణం లో ప్రాతినిధ్యం ల తాలూకు అవకాశాల ను ఈ మేళా అందించనుంది.
దేశం లోని వివిధ ప్రాంతాల నుండి ఎంపిక అయిన వారు భారత ప్రభుత్వం లో జూనియర్ ఇంజినీర్స్ , లోకో పైలట్స్ , టెక్నీశియన్స్, ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్స్, కానిస్టేబుల్ , స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, గ్రామీణ్ డాక్ సేవక్, ఇన్ కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్, టీచర్, నర్స్, డాక్టర్, సోశల్ సెక్యూరిటి ఆఫీసర్, పిఎ, ఎంటిఎస్ మొదలైన వేరు వేరు పదవుల లో/ఉద్యోగాల లో చేరనున్నారు.
ఉద్యోగాల లోకి ఈ మధ్యే చేర్చుకొన్న అధికారులు కర్మయోగి ప్రారంభ్ మాడ్యూల్ నుండి ఏయే విషయాల ను నేర్చుకొన్నారో కూడా ఈ రోజ్ గార్ కార్యక్రమం లో వెల్లడించేందుకు ఆస్కారం ఉంది. వివిధ ప్రభుత్వ విభాగాల లో కొత్త గా నియామకం జరిగిన వారందరి కి ఆన్ లైన్ మాధ్యం ద్వారా ఓరియంటేశన్ కోర్సు ను బోధించేందుకు రూపొందించిందే కర్మయోగి ప్రారంభ్ మాడ్యూల్.
Rozgar Mela is our endeavour to empower the country's youth. pic.twitter.com/BsNnn94jY7
— PMO India (@PMOIndia) January 20, 2023
भर्ती प्रक्रिया में व्यापक बदलाव हुआ है।
— PMO India (@PMOIndia) January 20, 2023
केंद्रीय सेवाओं में भर्ती प्रक्रिया पहले की तुलना में ज्यादा streamline और time bound हुई है। pic.twitter.com/JpYVzBRlyH
शासन व्यवस्था में हमारा मंत्र होना चाहिए – Citizen is always right. pic.twitter.com/hBVGDJeSCs
— PMO India (@PMOIndia) January 20, 2023