35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లోని 35 పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటుల ను ప్రధానమంత్రి అంకితం చేశారు
దేశం లో అన్ని జిల్లాల లో ప్రస్తుతం పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటు లు పనిచేస్తున్నాయి
ప్రభుత్వ అధినేత గా వరుస గా 21వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న వేళ లో దేశ ప్రజల కు, ఉత్తరాఖండ్ ప్రజల కు ఆయన కృతజ్ఞత నువ్యక్తం చేశారు.
‘‘ఉత్తరాఖండ్ గడ్డ తో నా సంబంధం అనేది ఒక్క హృదయం తోనే కాదు, అది చేతల తో కూడా ముడిపడి ఉన్నటువంటిసంబంధం; సారం ఒక్కటి తోనే ఉన్న సంబంధం కాదది మూల పదార్థం తో ఉన్న సంబంధం కూడాను.’’
‘‘కరోనా మహమ్మారి తో పోరాడడం కోసం అంత తక్కువ వ్యవధి లో భారతదేశం సిద్ధం చేసినసదుపాయాలు, మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. మహమ్మారి కంటేముందు ఒకే టెస్టింగ్ ల్యాబ్ ఉండగా, ఆనక సుమారు 3000 టెస్టింగ్ ట్యాబ్స్ ల నెట్ వర్కు నునిర్మించడమైంది’’
‘‘డిమాండు వృద్ధి చెందుతున్న కొద్దీ, భారతదేశం మెడికల్ ఆక్సీజన్ ఉత్పత్తి నిపదింతల కు పైగా పెంచింది’’
‘‘అతి త్వరలో భారతదేశం ప్రజల కు టీకా మందు ను ఇప్పించడం లో 100 కోట్ల వ స్థానాన్ని అధిగమించనుంది’’
‘‘ప్రస్తుతం పౌరులు వారి సమస్యల తో తన దగ్గర కు వచ్చే వరకు చూసి, ఆ తరువాతచర్య తీసుకోవాలి అని ప్రభుత్వం వేచి ఉండడం లేదు. ఈదురభిప్రాయాన్ని ప్రభుత్వ మనస్తత్వం లో నుంచి, వ్యవస్థ లో నుంచి తొలగించడం జరుగుతున్నది. ఇప్పుడుప్రభుత్వమే పౌరుల వద్దకు వెళ్తున్నది’’
‘‘ఆరేడేళ్ళ కిందటి వరకు, కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఎఐఐఎమ్ఎస్ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి; ప్రస్తుతం ఎఐఐఎమ్ఎస్ ను ప్రతి రాష్ట్రం లోకి తీసుకుపోయే పని జరుగుతోంది’’
‘‘దేశం లోని ప్రతి ఒక్క జిల్లా లో కనీసం ఒక వైద్య కళాశాల తప్పక ఉండాలి అన్నదేప్రభుత్వ లక్ష్యం కూడా’’
‘‘కేవలం రెండు సంవత్సరాల లోపే, రాష్ట్రం లోదాదాపు 6 లక్షల ఇళ్ళ కు నీటి సరఫరా సదుపాయాన్ని సమకూర్చడం జరిగింది. 2019వ సంవత్సరం లో ఉత్తరాఖండ్ లో 1,30,000 కుటుంబాలు గొట్టపు మార్గం ద్వారానీటిని అందుకొంటూ ఉండగా, ప్రస్తుతం ఉత్తరాఖండ్ 7,10,000 ఇళ్ళ కు గొట్టపు మార్గాల ద్వారా నీటి నిఇవ్వడం జరుగుతోంది’’
‘‘ప్రతి ఒక్క జవాను, ప్రతి ఒక్క మాజీ సైనికోద్యోగిప్రయోజనాల విషయం లో ప్రభుత్వం చాలా గంభీరంగా ఉంది. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ ను అమలు చేయడం ద్వారా సాయుధ బలగాల లోనిమన సోదరుల 40 సంవత్సరాల పాత డిమాండు ను మా ప్రభుత్వం నెరవేర్చింది’’

పిఎమ్ కేర్స్ లో భాగం గా 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లో ఏర్పాటైన 35 ప్రెశర్ స్వింగ్ అడ్ సార్ప్ శన్ (పిఎస్ఎ) ఆక్సీజన్ ప్లాంటు లను ఉత్తరాఖండ్ లోని ఎఐఐఎస్ఎ రుషీకేశ్ లో జరిగిన ఒక కార్యక్రమం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంకితమిచ్చారు. దీనితో దేశం లోని అన్ని జిల్లాల లో పిఎస్ఎ ఆక్సీజన్ ప్లాంటులు పని చేయడం మొదలైంది. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు, ఉత్తరాఖండ్ గవర్నరు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఆరోగ్య సంరక్షణ రంగ వృత్తి నిపుణులు పాలుపంచుకొన్నారు.

ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, పవిత్రమైనటువంటి నవరాత్రి పర్వదినాలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయన్నారు. నవరాత్రి ఉత్సవాల లో ఒకటో రోజు న మాత శైలపుత్రి ని ఆరాధించడం జరుగుతుంది అని ఆయన అన్నారు. హిమవంతుని పుత్రిక శైలపుత్రి అని ఆయన తెలిపారు. ‘‘ఈ నేల కు ప్రణమిల్లాలని, హిమాలయాల కు నెలవు అయినటువంటి ఈ భూమి కి వందనాన్ని ఆచరించాలని ఈ రోజు న నేను ఇక్కడ కు విచ్చేశాను; దీని కంటే జీవితం లో ఒక గొప్ప ఆశీర్వాదం మరేమి ఉంటుంది!’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఒలింపిక్ క్రీడోత్సవాల లో, పారాలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన ను ఇచ్చినందుకు రాష్ట్రానికి ఆయన అభినందన లు తెలిపారు. ఉత్తరాఖండ్ గడ్డ తో తనకు గల సంబంధం ఒక్క హృదయానిది మాత్రమే కాదని, అది కార్యాచరణ తో కూడా ముడిపడి ఉన్నటువంటిదని, కేవలం సారం తో కాక మూల పదార్థం తో కూడా ఆ బంధం పెనవేసుకొందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

తనకు సంబంధించినంత వరకు ఈ రోజు కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, 20 సంవత్సరాల క్రితం ఇదే రోజు న ప్రజల కు సేవ చేసే ఒక కొత్త బాధ్యత తనకు దక్కిన సంగతి ని ఆయన గుర్తు కు తెచ్చుకొన్నారు. ప్రజల కు సేవ చేయడం, ప్రజల మధ్య జీవనాన్ని కొనసాగించడం తాలూకు తన ప్రస్థానం అనేక దశాబ్దాలు గా కొనసాగుతూ వచ్చినప్పటికీ, 20 ఏళ్ళ కిందట ఈ రోజున నే, గుజరాత్ ముఖ్యమంత్రి గా ఒక కొత్త బాధ్యత ను చేపట్టాను అని ఆయన అన్నారు. ఈ యాత్ర ఆరంభం నాడే ఉత్తరాఖండ్ రాష్ట్ర స్థాపన చోటు చేసుకొంది, ఆ తరువాత కొద్ది నెలల కే గుజరాత్ ముఖ్యమంత్రి పదవి ని చేపట్టానని ఆయన చెప్పారు. ప్రజల ఆశీస్సుల తో తాను ప్రధాన మంత్రి పదవి ని చేపడుతాను అని ఎన్నడూ ఊహించలేదు అని ఆయన అన్నారు. ప్రభుత్వ అధినేత గా తాను ఈ అవిచ్ఛిన్న ప్రయాణం తాలూకు 21వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న సందర్భం లో దేశ ప్రజల కు, ఉత్తరాఖండ్ ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

యోగ, ఆయుర్వేద వంటి ప్రాణ ప్రదాన శక్తులు బలాన్ని పుంజుకొన్న గడ్డ మీది నుంచే, ఈ రోజు న, ఆక్సీజన్ ప్లాంటుల ను దేశ ప్రజల కు అంకితమిస్తుండడం పట్ల శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి తో పోరాడడం కోసం అంత తక్కువ వ్యవధి లో భారతదేశం సిద్ధం చేసిన సదుపాయాలు మన దేశం యొక్క సామర్ధ్యాన్ని చాటి చెప్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. మహమ్మారి రాక ముందు ఒకే ఒక టెస్టింగ్ ల్యాబు ఉండగా, ఆ తరువాత రమారమి 3,000 టెస్టింగ్ ల్యాబ్స్ తో కూడిన నెట్ వర్క్ ను నిర్మించడం జరిగింది అని ఆయన అన్నారు. భారతదేశం మాస్కుల ను, కిట్ లను దిగుమతి చేసుకొంటున్నది కాస్తా వాటి ఎగుమతిదారు దేశం స్థాయి కి మార్పు చెందింది అని ఆయన అన్నారు. దేశం లోని సుదూర ప్రాంతాల లో సైతం కొత్త వెంటిలేటర్ ల తాలూకు సదుపాయాల ను అందుబాటు లోకి తీసుకు రావడమైందన్నారు. ‘మేడ్ ఇన్ ఇండియా కరోనా వ్యాక్సీన్’ ను త్వరిత గతి న మరియు పెద్ద ఎత్తు న భారతదేశం తయారు చేసింది అని ఆయన అన్నారు. భారతదేశం లో ప్రపంచం లో అతి పెద్దదైనటువంటి మరియు అత్యంత వేగవంతమైనటువంటి టీకాకరణ ఉద్యమాన్ని అమలుపరచిందని ఆయన అన్నారు. భారతదేశం సాధించిన పని మన దృఢసంకల్పాని కి, మన సేవ కు, అలాగే మన సంఘీభావాని కి ఒక చిహ్నం గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.

సాధారణమైన రోజుల లో భారతదేశం ఒక్కరోజు లో 900 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ ను ఉత్పత్తి చేస్తూ వచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు. డిమాండు పెరుగుతూ ఉండటం వల్ల, భారతదేశం మెడికల్ ఆక్సీజన్ ఉత్పత్తి ని పదింతల కు పైగా పెంచింది అని ఆయన చెప్పారు. ఇది ప్రపంచం లోని ఏ దేశాని కి అయినా ఊహించలేనటువంటి లక్ష్యం, కానీ భారతదేశం దీనిని చేసి చూపించింది అని ఆయన అన్నారు.

93 కోట్ల డోజుల కరోనా వ్యాక్సీన్ ను ప్రజల కు ఇప్పించడం అనేది భారతదేశం లో ప్రతి ఒక్కరికీ గర్వకారణం అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. అతి త్వరలోనే భారతదేశం 100 కోట్ల వ స్థానాన్ని అధిగమిస్తుంది అని ఆయన అన్నారు. భారతదేశం కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను నిర్మించడం ద్వారా అంతటి భారీ స్థాయి లో టీకా మందు ను ఇవ్వడం ఎలా సాధ్యమో యావత్తు ప్రపంచాని కి చాటిచెప్పింది అని ఆయన అన్నారు.

పౌరులు వారి సమస్యల తో ప్రభుత్వం వద్దకు వస్తే అప్పుడు ఏదైనా చర్య తీసుకోవడం కోసం ప్రభుత్వం వేచి ఉండబోదు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ భ్రాంతిని ప్రభుత్వ మనస్తత్వం లో నుంచి మరియు వ్యవస్థ లో నుంచి తొలగించడం జరుగుతోంది అని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వమే పౌరుల వద్ద కు వెళ్తోందని ఆయన అన్నారు.

ఆరేడేళ్ళ కిందటి కాలం వరకు చూస్తే, కేవలం కొన్ని రాష్ట్రాలే ఎఐఐఎమ్ఎస్ సదుపాయాన్ని కలిగి ఉన్నాయి; ప్రస్తుతం ఎఐఐఎమ్ఎస్ ను ప్రతి ఒక్క రాష్ట్రాని కి తీసుకు పోవడం కోసం కృషి జరుగుతోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మనం 6 ఎఐఐఎమ్ఎస్ ల మజిలీ నుంచి వేగం గా కదలుతూ 22 ఎఐఐఎమ్ఎస్ లతో కూడిన ఒక బలమైన నెట్ వర్క్ ను నిర్మించే దిశ లో ముందుకు పోతున్నాం అని ఆయన చెప్పారు. దేశం లో ప్రతి జిల్లా లో కనీసం ఒక వైద్య కళాశాల తప్పక ఉండాల్సిందే అన్నదే ప్రభుత్వం లక్ష్యం కూడాను అని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ ను ఏర్పాటు చేయాలి అనే కల ను పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ నెరవేర్చారు అని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు. సంధానాని కి, అభివృద్ధి కి మధ్య ప్రతక్ష సంబంధం ఉందని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ నమ్మారు అని ప్రధాన మంత్రి చెప్పారు. ఆయన ప్రేరణ వల్ల ప్రస్తుతం దేశం లో సంధాన సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ను ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి వేగం తో, ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి స్థాయి లో మెరుగు పరచే దిశ లో పాటుపడడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

జల్ జీవన్ మిశన్ ను 2019వ సంవత్సరం లో ప్రారంభించడానికి పూర్వం ఉత్తరాఖండ్ లో 1,30,000 కుటుంబాలు మాత్రమే నల్లా నీటి ని అందుకొంటూ ఉండేవి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో 7,10,000 కు పైబడిన ఇళ్ళ కు నల్లా ద్వారా తాగునీరు అందడం మొదలైందని తెలిపారు. అంటే, కేవలం రెండు సంవత్సరాల కాలం లో రాష్ట్రం లో సుమారు 6 లక్షల ఇళ్ళు నల్లా నీటి ని అందుకొన్నాయి అని ఆయన వివరించారు. ప్రతి ఒక్క జవాను, ప్రతి ఒక్క మాజీ సైనికోద్యోగి.. వీరి ప్రయోజనాల కోసం కూడా ప్రభుత్వం చాలా గంభీరం గా కృషి చేస్తోందని ప్రధాన మంత్రి తెలిపారు. ‘వన్ ర్యాంకు, వన్ పెన్శన్’ ను అమలు చేసి సాయుధ బలగాల లోని మన సోదరుల 40 ఏళ్ళ నాటి డిమాండు ను తీర్చింది మా ప్రభుత్వం అని కూడా ఆయన అన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi