ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ మహాకాల్ లోక్ 1 ప్రాజెక్టును మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని శ్రీ మహాకాల్లోక్‌వద్ద ఈరోజు జాతికి అంకితం చేశారు. ఈ ఆలయానికి ప్రధానమంత్రి సంప్రదాయ దుస్తులలో వచ్చారు.నంది ద్వారం నుంచి ప్రధానమంత్రి ఆలయంలోకి ప్రవేశించారు.అనంతరం ప్రధానమంత్రి మంత్రాలు చదువుతూ కొద్దిసేపు ధ్యానంలో కూర్చున్నారు. నందివిగ్రహం వద్ద కూర్చుని కొద్ది సేపు ప్రార్థనలు చేశారు.
అనంతరం ప్రధానమంత్రి శ్రీ మహాకాల్‌లోక్‌ను జాతికి అంకితం చేసే ఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఆలయ అర్చకులను కలుసుకుని వారితో కొద్దిసేపు మాట్లాడారు. ప్రధానమంత్రి మహాకాల్‌లోక్ ఆలయ కాంప్లెక్స్‌ను సందర్శించి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి సప్తర్షి మండలాన్ని ,మండపాన్ని, త్రిపురాసువ వధ, నవగ్రహ మండపాన్ని దర్శించారు. మార్గంలో గణేశుడి జననానికి సంబంధించిన ఘట్టాలు, శివపురాణంలోని సతి, దక్షుడికి సంబంధించిన ఘట్టాలను తిలకించారు. అనంతరం ప్రధానమంత్రి మాన్‌సరోవర్‌వద్ద ఏర్పాటుచేసిన మాల్‌ఖంబ ను తిలకించారు. అనంతరం భారత మాత మందిరానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు.
ప్రధానమంత్రి వెంట మధ్యప్రదేశ్ గవర్నర్, శ్రీ మంగుభాయ్ పటేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు శ్రీజ్యోతిరాదిత్య సింధియా తదితరులు ఉన్నారు.
నేపథ్యంః
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ మహాకాల్‌లోక్‌ప్రాజెక్టు తొలిదశను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శ్రీ మహాకాల్‌లోక్‌వద్ద జాతికి అంకితం చేశారు. మహాకాల్‌లోక్ ప్రాజెక్టు తొలిదశ ఈ ఆలయాన్ని సందర్శించే వారికి ప్రపంచశ్రేణి అధునాతన సదుపాయాలను కల్పిస్తుంది.
ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని సువిశాలంగా చేయడంతోపాటు, చారిత్రక వారసత్వ కట్టడాల పరిరక్షణ ,పునరుద్ధరణపై శ్రద్ధ చూపుతుంది.ఈ ప్రాజెక్టుకింద ఆలయ పరిసరాలను ఏడురెట్లు విశాలం చేస్తారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు 850 కోట్ల రూపాయలవరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆలయ సందర్శనకుఏటా 1.5 కోట్ల మంది వస్తుండగా, వీరి సంఖ్య ఇక ముందు రెట్టింపు కానుంది. ఈ ప్రాజెక్టు అభివృద్ధిని రెండు దశలలోచేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు.
మహాకాల్ పథ్ లో 108 స్థంభాలు ఉంటాయి. ఇవి ఆనంద తాండవ స్వరూప(నృత్యరూప)శివుడిని చూపుతాయి. అలాగే మహాకాల్‌పథ్ లో శివుడి కి సంబంధించిన వివిధ ఘట్టాలను ప్రదర్శిస్తున్నారు. అలాగే అక్కడి గోడపై గణేశుడి జన్మ వృత్తాంతం, శివపురాణంలోని దక్షుడు, సతి కి సంబంధించిన ఘట్టాలు ఉన్నాయి. ఈ ప్రదేశం 2.5 హెక్టార్లలో విస్తరించి ఉంది. పక్కనే పద్మాలతో కూడిన కొలను,అందులో వాటర్‌ఫౌంటైన్, శివుడి విగ్రహం ఉన్నాయి. ఈ మొత్తం ప్రాంగణాన్ని అనుక్షణం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉంటుంది. అలాగే కృత్రిమ మేధ, నిఘా కెమెరాలు కూడా వినియోగిస్తున్నారు.