ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోచి మెట్రోను ఈ రోజు ప్రారంభించారు; కొత్త మెట్రో రైలు మార్గంలో కొద్దిసేపు ప్రయాణించారు కూడా. ఆయన ఆ తరువాత కోచి మెట్రో ను దేశ ప్రజలకు అంకితమిచ్చేందుకు నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం ఈ కింది విధంగా ఉంది:
కోచి మెట్రో ప్రారంభోత్సవంలో భాగస్వామిని కావడం నాకు సంతోషం కలిగిస్తోంది. ఈ గర్వకారకమైన ఘడియలో కోచి ప్రజలకు ఇవే నా అభినందనలు.
మిత్రులారా,
కోచి.. అరేబియా సముద్రానికి మహా రాణి, ఇది ఒక ప్రధానమైన సుగంధ ద్రవ్యాల వాణిజ్య కేంద్రం. ఇవాళ ఈ పట్టణం కేరళ కు వాణిజ్య రాజధానిగా పేరు తెచ్చుకొంది. కేరళ సందర్శనకు తరలివచ్చే అంతర్జాతీయ, జాతీయ పర్యటకుల మొత్తం సంఖ్యలో కోచి ని చూడవచ్చే వారు ఒకటో స్థానంలో ఉంటారు. ఇటువంటి కోచి కి మెట్రో రైలు సదుపాయం ఉండటం సముచితమైనటువంటిది.
ఈ నగర జనాభా నిలకడైనటువంటి తీరులో వర్ధిల్లుతోంది; 2021 కల్లా ఇరవై మూడు లక్షలకు చేరుకోగలదన్న అంచనా ఉంది. ఈ కారణంగా, పట్టణ మౌలిక సదుపాయాలపై పెరుగుతున్న ఒత్తిడిని ఉపశమింపజేసే సామూహిక శీఘ్ర రవాణా వ్యవస్థ (ఎమ్ఆర్ టిఎస్) సమకూరవలసిన అవసరం ఉంది. ఇది కోచి ఆర్థిక ప్రగతికి కూడా తోడ్పడగలదు.
కోచి మెట్రో రైల్ లిమిటెడ్ భారత ప్రభుత్వం మరియు కేరళ ప్రభుత్వాల చెరి సగం వాటాలు ఉన్నటువంటి సంయుక్త సంస్థ గా ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు 2వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను కోచి మెట్రో కోసం విడుదల చేసింది. ఇవాళ ప్రారంభిస్తున్న ఒకటో దశ అలువా నుండి పలారీవట్టమ్ మధ్య 13.26 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. ఈ మార్గంలో 11 స్టేషన్ లు ఉన్నాయి.
ఈ మెట్రో ప్రాజెక్టు లో పలు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
ఇది అత్యాధునికమైనటువంటి ‘‘సమాచార ఆధారిత రైలు నియంత్రణ సిగ్నలింగ్ వ్యవస్థ’’తో పని చేసే మొదటి మెట్రో పథకం.
రైలు పెట్టెలు ‘‘భారత్‌లో తయారీ’’ (మేక్ ఇన్ ఇండియా) దార్శనికతను ప్రతిబింబిస్తాయి. వీటిని ఫ్రాన్స్‌కు చెందిన అల్‌స్టామ్ సంస్థ చెన్నై సమీపంలోని తన కర్మాగారంలో నిర్మించింది. వీటిలో సుమారు 70 శాతం వరకు భారతీయ కంపోనంట్ లే.
నగరం యొక్క యావత్తు ప్రజా రవాణా నెట్ వర్క్ ను ఒకే వ్యవస్థగా కోచి మెట్రో జోడిస్తుంది. దీనికి ఉమ్మడి టైం-టేబుల్, ఉమ్మడి టికెట్ల జారీ వ్యవస్థ, కేంద్రీకృతమైన కమాండ్ అండ్ కంట్రోల్ ఉంటాయి. నగర అంతర్భాగంలో చిట్టచివరి మోటారు రహిత రవాణా వ్యవస్థల సంధానం మెరుగుదల పైనా ఈ వ్యవస్థ దృష్టి సారిస్తుంది.
టికెట్ల జారీ కోసం వినూత్నమైనటువంటి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం నమూనా ద్వారా కోచి మెట్రో మార్గదర్శిగా నిలుస్తోంది. తనంతట తానే కిరాయి వసూలు చేసే (ఎఫ్ సిఎస్) వ్యవస్థను నిర్వహించేందుకుగాను పెట్టుబడి పెట్టేందుకు బిడ్ లు సమర్పించవలసిందిగా భారతీయ బ్యాంకులను మరియు ఆర్థిక సహాయ సంస్థల ను ఆహ్వానించే ప్రక్రియ మొదలైంది. ఎంపిక అయినటువంటి బ్యాంకు కోచి మెట్రో ఫేర్ కార్డు మరియు యాప్ ల బ్రాండింగ్ లో పాలు పంచుకొంటుంది.
ఇలా విడుదల చేసే కోచి-1 కార్డు బహుళ ప్రయోజన ప్రి-పెయిడ్ సంపర్క రహిత రూపే కార్డు రూపంలో ఉంటుందని, దీనిని మెట్రో రైలు లో ప్రయాణించేందుకే గాక సాధారణ డెబిట్ కార్డు లాగానూ వాడుకోవచ్చునని నాకు తెలియజేశారు. అంతేకాకుండా బస్సులు, టాక్సీలు, ఆటోల లోనూ ప్రయాణించగల సార్వత్రిక సంధాన స్మార్ట్ కార్డును కలిగివున్న ప్రపంచంలోని కొద్ది నగరాలలో కోచి కూడా ఒక నగరంగాను, భారతదేశంలోని ఇటువంటి సదుపాయం ఉండే తొలి నగరంగాను ప్రసిద్ధం కానుంది.
ఇదేగాక కోచి-1 మొబైల్ యాప్‌ను కూడా దీర్ఘకాలిక దృష్టితో రూపొందిస్తున్నట్లు నాకు తెలిపారు. కోచి-1 కార్డుకు ఈ యాప్ అనుబంధ ఎలక్ట్రానిక్ వ్యాలెట్ జతపడి ఉంటుంది. పౌరులు తొలుత కోచి మెట్రో సేవలు పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో నగర ప్రయాణ సంబంధ, ఇతర నిత్య చెల్లింపుల అవసరాలన్నిటినీ ఇది తీరుస్తుంది. అంతేకాదు.. నగర, పర్యాటక సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఆ విధంగా ఎలక్ట్రానిక్ పాలన వేదికకు ఇదో మంచి ఉదాహరణగా నిలుస్తుంది. కోచి మెట్రో రైలు వ్యవస్థలో పనిచేసేందుకు వెయ్యి మంది మహిళలు, 23 మంది లింగ మార్పిడి వ్యక్తులను ఎంపిక చేయడం ఈ ప్రాజెక్టు లో గమనించదగిన మరో అంశం.
పర్యావరణహిత అభివృద్ధికీ ఈ పథకం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. దీని నిర్వహణకు అవసరమైన ఇంధన అవసరాల్లో సుమారు 25 శాతం దాకా పునరుత్పాదక వనరులు.. ప్రత్యేకించి సౌర శక్తి వంటి వాటి ద్వారా సమకూర్చుకొనేటట్లు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇది కర్బన ఉద్గార రహిత పట్టణ రవాణా వ్యవస్థగా రూపొందాలన్నది దీర్ఘకాలిక ప్రణాళిక. మెట్రో వ్యవస్థలోని ప్రతి ఆరో ఆధార స్తంభంలో నిలువుగా ఏర్పరచే అంతర్గత తోట పట్టణ ఘన వ్యర్థాలను గణనీయంగా వినియోగించుకుంటుంది.
కోచి మెట్రో నిర్వహణ- నియంత్రణ కేంద్రం సహా మొత్తం అన్ని స్టేషన్ లకూ భారత హరిత భవన మండలి ప్రదానం చేసే అత్యున్నత ‘ప్లాటినమ్ రేటింగ్’ లభించడం ఈ సందర్భంగా ముదావహం.
మిత్రులారా,
గడచిన మూడేళ్లుగా నా ప్రభుత్వం జాతీయ మౌలిక సదుపాయాల సర్వతోముఖాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రైల్వేలు, రహదారులు, విద్యుత్తు మా ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయి. ప్రగతి (PRAGATI) సమావేశాల సందర్భంగా 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన దాదాపు 175 ప్రాజెక్టులను నేను వ్యక్తిగతంగా సమీక్షించాను. వీటికి సంబంధించిన చిక్కులన్నిటినీ పరిష్కరించి ఈ రంగాలలో సగటు అమలు శాతాన్ని గణనీయంగా మెరుగుపరిచాం. ఇప్పుడిక రవాణా, డిజిటల్, గ్యాస్ సహా ఇతర రంగాలలో ఆధునిక తరం మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన మేం దృష్టి సారించాం. ప్రత్యేకించి నగరాలలో ప్రజా రవాణాను పెంచడంపై అనేక చర్యలకు శ్రీకారం చుట్టాం. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాం.
దేశంలోని 50 నగరాలు మెట్రో రైలు ప్రాజెక్టుల అమలుకు సిద్ధంగా ఉన్నాయి. మెట్రో రైలు వ్యవస్థలతో ఒనగూడే ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు అందరికీ బాగా తెలిసినవే. ఈ రంగంలో విధాన రూపకల్పన వేగాన్ని మేం పెంచాం. మెట్రో రైలు యూనిట్లు, సిగ్నల్ వ్యవస్థ తదితరాలకు సంబంధించిన ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే స్థిరీకరించింది. తద్వారా దీర్ఘకాలిక దృష్టి కోణంలో భారత్‌లో ఆ నిర్మాణ సదుపాయాలను నెలకొల్పేందుకు తగిన ప్రోత్సాహం తయారీదారులకు లభిస్తుంది. అలాగే ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికతకు అనుగుణంగా మెట్రో యూనిట్ ల తయారీని దేశీయంగా ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాం.
మిత్రులారా,
పట్టణాభివృద్ధి ప్రణాళికలలో ఆదర్శప్రాయమైన మార్పును తీసుకు వచ్చే దిశగా ప్రజా కేంద్రక విధానాలతో పాటు భూ వినియోగం, రవాణా సదుపాయాల మధ్య సమన్వయం సాధించాల్సిన అవసరం ఉంది.
ఈ దిశగా, 2017 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డివెలప్ మెంట్ పాలిసీ ని ప్రకటించింది. రవాణా ఆధారిత దశ నుండి రవాణా ప్రాధాన్య దిశగా నగరాల పరివర్తనే ఈ విధానం లక్ష్యం. నడకకు వీలు కల్పించే కుదురైన ప్రాంతాల సృష్టితో పాటు ప్రజా రవాణా సదుపాయాలను రవాణా ప్రదేశాల దరికి చేర్చడంపైన ఇది దృష్టి సారిస్తుంది.
ఇందులో భాగంగా ఒక వేల్యూ కేప్చర్ ఫైనాన్స్ పాలిసీ ఫ్రేమ్ వర్క్ ను రూపకల్పన చేసినందుకు శ్రీ వెంకయ్య నాయుడు గారి నేతృత్వంలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ను నేను అభినందిస్తున్నాను. పెరిగిన భూమి విలువను అందిపుచ్చుకునే యంత్రాంగం ఏర్పాటుకు ఇది వీలు కల్పిస్తుంది.
కీలకమైన ఈ మైలురాయిని అందుకున్నందుకు కోచి పౌరులకు, కోచి మెట్రో రైల్ కార్పొరేషన్ కు, మరియు కేరళ ముఖ్యమంత్రికి అభినందనలతో నా ప్రసంగాన్ని ముగించనివ్వండి. స్మార్ట్ సిటీల కోసం 2016 జనవరిలో నిర్వహించిన తొలి విడత ప్రక్రియలో కోచి నగరం ఎంపికైంది. రాబోయే రోజులలోనూ ఈ నగరం మరింత ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నాను.
మీ కందరికీ ధన్యవాదాలు.
Kochi, the queen of Arabian Sea was once an important spice trading centre. Today it is known as the commercial capital of Kerala: PM Modi
— PMO India (@PMOIndia) June 17, 2017
Kochi Metro Rail Limited is a 50-50 Joint Venture of GoI & Govt of Kerala. Union Government has so far released over Rs 2000 crore: PM Modi
— PMO India (@PMOIndia) June 17, 2017
The coaches reflect “Make in India” vision. They have been built by Alstom near Chennai, and have an Indian component of around 70%: PM
— PMO India (@PMOIndia) June 17, 2017
Over the last three years, my Government has placed special focus on overall infrastructure development of the nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 17, 2017
In PRAGATI meetings, I have personally reviewed nearly 175 projects worth more than eight lakh crore rupees & resolved bottlenecks: PM Modi
— PMO India (@PMOIndia) June 17, 2017
We are also focusing on next generation infrastructure, which includes logistics, digital and gas: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 17, 2017
There is need to bring about a paradigm shift in urban planning by adopting a people-centric approach & integrating land-use & transport: PM
— PMO India (@PMOIndia) June 17, 2017
Kochi was selected as a Smart City in Round 1 of the challenge in January 2016. I hope it will do even better in the days to come: PM Modi
— PMO India (@PMOIndia) June 17, 2017