Quoteఎఐఐఎమ్ఎస్ ను, ఫర్టిలైజర్ ప్లాంటు ను, ఐసిఎమ్ఆర్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు
Quoteడబల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి పనుల వేగాన్ని రెట్టింపుచేస్తుంది: ప్రధాన మంత్రి
Quote‘‘వంచన కు గురైన, దోపిడి బారిన పడిన వర్గాల నుగురించి ఆలోచించేటటువంటి, కఠోరం గాశ్రమించేటటువంటి మరియు ఫలితాల ను రాబట్టేటటువంటి ప్రభుత్వం’’
Quote‘‘ఈ రోజున జరుగుతున్న ఈకార్యక్రమం ‘న్యూ ఇండియా’ దృఢ సంకల్పాని కి ఒక సాక్ష్యంగా ఉంది; వీరికి ఏదీ అసాధ్యంకాదు’’
Quoteచెరకు రైతుల కు ప్రయోజనం కలిగించడం కోసం చేసిన కృషి కి గాను ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన పొగడారు

ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో అనేక అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు.

|

గోరఖ్ పుర్ లో ఎఐఐఎమ్ఎస్ ప్రారంభోత్సవం, ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవం , అలాగే ఐసిఎమ్ఆర్ ప్రాంతీయ చికిత్స పరిశోధన కేంద్రం తాలూకు కొత్త భవనం.. వీటికి గాను ఉత్తర్ ప్రదేశ్ ప్రజల కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు. 5 సంవత్సరాల కిందట ఎఐఐఎమ్ఎస్ కు, ఎరువుల కర్మాగారాని కి శంకుస్థాపన చేసిన సంగతి ని ఆయన గుర్తు చేస్తూ, ఆ రెండిటి ని ఈ రోజున ప్రారంభించినట్లు తెలిపారు. ఒకప్పుడు చేపట్టిన పథకాల ను పూర్తి చేసిన ప్రభుత్వం పని తీరు ను గురించి ఆయన నొక్కిచెప్పారు.

|

జోడు ఇంజిన్ ల ప్రభుత్వం ఉంది అంటే అభివృద్ధి పనుల అమలు రెండింతల వేగం తో సాగుతుంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఎప్పుడైతే పని ని ఒక సదుద్దేశ్యం తో చేయడం జరిగిందో అటువంటప్పుడు విపత్తు లు సైతం ఒక అడ్డంకి కాజాలవు అని ఆయన అన్నారు. పేదల, అణగారిన వర్గాల, ప్రయోజనాల కు నోచుకోకుండా ఉండిపోయినటువంటి వర్గాల వారిని గురించి శ్రద్ధ తీసుకొనే ప్రభుత్వం ఉన్నప్పుడు, అది కష్టపడి పని చేసే ఆ వర్గాల వారిని వెంటబెట్టుకొని వెళ్తూ ఫలితాల ను చూపుతుంది అని ఆయన అన్నారు. ‘న్యూ ఇండియా’ దృఢ దీక్ష ను పూనినప్పుడు ఏదీ అసాధ్యం కాదు అని ఈ రోజు న జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం రుజువు చేసింది అని ఆయన అన్నారు.

|

మూడు విధాలైన వైఖరి లో భాగం గా ప్రభుత్వం యూరియా కు 100 శాతం వేప పూత పద్ధతి ని ప్రవేశపెట్టి యూరియా దుర్వినియోగాన్ని ఆపివేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. కోట్ల కొద్దీ రైతుల కు భూమి స్వస్థత కార్డుల ను ఇవ్వడం జరుగుతోంది, ఈ కారణం గా వారు వారి పొలాని కి ఏ రకమైన ఎరువు అవసరమో నిర్ణయించుకోగలుగుతారు అని ఆయన అన్నారు. యూరియా ఉత్పత్తి ని పెంచడానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది అని ఆయన అన్నారు. ఉత్పత్తి ని పెంచడం కోసం మూతపడ్డ ఎరువుల కర్మాగారాల ను కూడా తిరిగి తెరవక తప్పని స్థితి ని సైతం కల్పించడమైంది అన్నారు. దేశం లో వేరు వేరు ప్రాంతాల లో 5 ఎరువుల కర్మాగారాల పనుల ను పూర్తి చేయడమైంది, దీని ద్వారా 60 లక్షల టన్నుల యూరియా దేశం లో అందుబాటు లోకి రానుంది అని ప్రధాన మంత్రి తెలిపారు.

|

ఇటీవలి కొన్నేళ్ళలో చెరకు రైతుల కోసం మునుపెన్నడూ లేని విధం గా కృషి చేసినందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. చెరకు రైతుల కు గిట్టుబాటు ధర ను ఇటీవల 300 రూపాయల వరకు పెంచినందుకు, గడచిన 10 ఏళ్ళ కాలం లో చెరకు రైతుల కు ఇదివరకటి ప్రభుత్వాలు చెల్లించినంతటి మొత్తాన్ని దాదాపు గా చెల్లించినందుకు కూడాను ప్రభుత్వాన్ని ఆయన కొనియాడారు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుంచి ఈ శతాబ్ది ఆరంభం వరకు దేశం లో ఒకే ఒక ఎఐఐఎమ్ఎస్ ఉందని ప్రధాన మంత్రి అన్నారు. మరో 6 ఎఐఐఎమ్ఎస్ లకు పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ ఆమోదం తెలిపారన్నారు. దేశవ్యాప్తం గా 16 కొత్త ఎఐఐఎమ్ఎస్ లను నిర్మించడం కోసం గత ఏడు సంవత్సరాలు గా పనులు జరుగుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లో ప్రతి ఒక్క జిల్లా కనీసం ఒక వైద్య చికిత్స కళాశాల ను కలిగి ఉండాలి అనేది తన ప్రభుత్వం లక్ష్యం అని ఆయన ప్రకటించారు.

|

ఈ ప్రాంతం లో రైతుల కోసం, అలాగే ఉపాధి కల్పన కోసం గోరఖ్ పుర్ లో ఫర్టిలైజర్ ప్లాంటు కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రతి ఒక్కరికీ ఎరుకే అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్లాంటు కు ప్రాముఖ్యం ఉన్నప్పటికీ కూడాను ఇదివరకటి ప్రభుత్వాలు దీని ని తిరిగి తెరవడం లో ఎలాంటి ఆసక్తి ని చూపలేదు అని ఆయన అన్నారు. గోరఖ్ పుర్ లో ఎఐఐఎమ్ఎస్ డిమాండు ఏళ్ళ తరబడి గా ఉన్నదన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసును. కానీ, 2017వ సంవత్సరాని కి పూర్వం ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చిన వారు గోరఖ్ పుర్ లో ఎఐఐఎమ్ఎస్ నిర్మాణాని కి అవసరమైన భూమి ని అందించడానికి అన్ని రకాల సాకులు చెప్పారు అని ఆయన అన్నారు. ఈ ప్రాంతం లో జాపనీస్ ఎన్ సెఫలైటిస్ కేసు లు బాగా తగ్గిపోయిన విషయాన్ని, దీనికి తోడు ఈ ప్రాంతం లో వైద్య చికిత్స సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన వృద్ధి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘ఎఐఐఎమ్ఎస్, అలాగే ఐసిఎమ్ఆర్ సెంటర్ లతో జాపనీస్ ఎన్ సెఫలైటిస్ కు వ్యతిరేకం గా జరుగుతున్న పోరు కొత్త శక్తి ని పుంజుకొంటుంది’’ అని ఆయన అన్నారు.

పెత్తనం చెలాయించే విధానాలు, అధికారం సంబంధి రాజకీయాలు, కుంభకోణాలు, ఇంకా మాఫియా పూర్వం రాష్ట్ర ప్రజల కు యాతన తెచ్చిపెట్టాయి అని ప్రధాన మంత్రి విమర్శించారు. ఆ తరహా శక్తుల విషయం లో జాగరూకత తో ఉండవలసిందంటూ ప్రజల కు ఆయన విజ్ఞప్తి చేశారు.

|

ఈ రోజున మా ప్రభుత్వం పేదల కోసం ప్రభుత్వ గోదాముల ను తెరచింది. మరి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతి కుటుంబాని కి ఆహారాన్ని సరఫరా చేయడం లో తీరిక లేకుండా ఉన్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. దాదాపు గా 15 కోట్ల మంది యుపి నివాసులు ఈ ప్రయోజనాన్ని అందుకొంటున్నారు అని కూడా ఆయన అన్నారు. ఇటీవల ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ ను హోలీ తరువాతి కాలం వరకు పొడిగించడం జరిగింది. ఇదివరకు ప్రభుత్వాలు నేరగాళ్ళ కు రక్షణ ను ఇవ్వడం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ పేరు ను అపఖ్యాతి పాలు చేశాయి. ప్రస్తుతం మాఫియా జైలు లో ఉంది. పెట్టుబడిదారులు యుపి లో స్వేచ్ఛ గా పెట్టుబడులు పెడుతున్నారు. రెండు ఇంజిన్ ల తాలూకు రెట్టింపు అభివృద్ధి అంటే ఇదీ. ఈ కారణం గానే యుపి ఒక జోడు ఇంజిన్ ల ప్రభుత్వం పట్ల నమ్మకం తో ఉంది అని ఆయన అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India: The unsung hero of global health security in a world of rising costs

Media Coverage

India: The unsung hero of global health security in a world of rising costs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Haryana Chief Minister meets PM Modi
February 27, 2025

The Chief Minister of Haryana, Shri Nayab Singh Saini met the Prime Minister, Shri Narendra Modi today.

The Prime Minister’s Office handle posted on X:

“Chief Minister of Haryana, Shri @NayabSainiBJP, met Prime Minister @narendramodi.

@cmohry”