Quoteవారాణసీ కంటోన్మెంట్ స్టేశన్ నుండి గోదౌలియా వరకు ప్యాసింజర్ రోప్ వే కు ఆయన శంకుస్థాపన చేశారు
Quoteజల్ జీవన్ మిశన్ లోభాగం గా 19 త్రాగునీటి పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు
Quote‘‘ప్రజల లో భయాందోళనల ను కాశీ అధిగమించడం తో పాటు నగరాన్ని పరివర్తన చెందింప చేయడం లో సఫలం అయింది’’
Quote‘‘గడచిన 9 ఏళ్ళ లో గంగ నదిఘాట్ ల రూపు రేఖ లు చాలా వరకు మారడాన్ని అందరు గమనించారు’’
Quote‘‘గత మూడేళ్ళ లో దేశం లో 8 కోట్ల కుటుంబాలు నల్లా నీటి సరఫరా ను అందుకొన్నాయి’’
Quote‘‘అమృత కాలం లో భారతదేశం అభివృద్ధి ప్రయాణం లో ప్రతి ఒక్కపౌరుడు/పౌరురాలు తోడ్పాటు ను అందించేటట్లుగాను, ఏ ఒక్కరు వెనుబడి పోకుండాను ప్రభుత్వం గట్టి గా కృషి చేస్తున్నది’’
Quote‘‘రాష్ట్రం లో ప్రతి ఒక్క రంగం యొక్క అభివృద్ధి లో క్రొత్త పార్శ్వాలను ఉత్తర్ ప్రదేశ్ జోడిస్తున్నది’’
Quote‘‘నిరుత్సాహం తాలూకు నీడల లో నుండి ఉత్తర్ ప్రదేశ్ బయట పడి ప్రస్తుతం తన ఆశల మరియు ఆకాంక్షలమార్గం లో సాగిపోతున్నది’’

వారాణసీ లో 1780 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువైన అభివృద్ధి పథకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేయడంతో పాటు వాటి ని దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ఈ పథకాల లో వారాణసీ కంటోన్మెంట్ స్టేశన్ నుండి గోదౌలియా వరకు ప్యాసింజర్ రోప్ వే కు శంకుస్థాపన చేయడం, నమామి గంగే పథకం లో భాగం గా 55 ఎమ్ఎల్ డి మురుగునీటి శుద్ధి ప్లాంటు ను భగవాన్ పుర్ లో ఏర్పాటు చేయడం, సిగ్ రా స్టేడియమ్ పునరభివృద్ధి పనుల తాలూకు రెండో దశ, మూడో దశ, సేవాపురీ లోని ఇస్ రవర్ గ్రామం లో హిందుస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ ఆధ్వర్యం లో నిర్మాణం కాబోయే ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంటు, భర్ థరా గ్రామం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దుస్తులు మార్చుకొనేందుకు సదుపాయం తో కూడినటువంటి ఒక ఫ్లోటింగ్ జెట్టి తదితర పథకాలు భాగం గా ఉన్నాయి. ప్రధాన మంత్రి ఇంకా జల్ జీవన్ మిశన్ లో భాగం గా 19 త్రాగునీటి పథకాల ను కూడా దేశ ప్రజల కు అంకితం చేశారు. అవి 63 గ్రామ పంచాయతుల లో 3 లక్షల మంది కి పైగా ప్రజల కు లబ్ధిని చేకూర్చనున్నాయి. ఇదే మిశన్ లో భాగం గా 59 త్రాగునీటి పథకాల కు ఆయన శంకుస్థాపన చేశారు. కర్ ఖియావ్ లో ఒక ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను సైతం ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ ప్లాంటు లో కాయగూరలు మరియు ఫలాల ను గ్రేడింగ్ చేయడం, సార్టింగ్ చేయడం, ఇంకా ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. వారాణసీ స్మార్ట్ సిటీ మిశన్ లో భాగం గా వివిధ పథకాల ను కూడా ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు.

|

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఇది మంగళప్రదమైనటువంటి నవరాత్రి కాలం, అంతేకాకుండా ఈ రోజు మాత చంద్రఘంట ను ఆరాధించే రోజు కూడాను అని గుర్తు కు తీసుకు వచ్చారు. ఈ విశిష్టమైనటువంటి సందర్భం లో వారాణసీ ప్రజల మధ్య కు విచ్చేయడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది అని ఆయన అన్నారు. వారాణసీ యొక్క సమృద్ధి లో ఒక కొత్త అధ్యాయం జతపడుతోందని కూడా ఆయన అన్నారు. వారాణసీ సర్వతోముఖ అభివృద్ధి కి గాను ఒక పేసింజర్ రోప్ వే కు శంకుస్థాపన తో పాటు వందల కోట్ల రూపాయల విలువైన మరిన్ని పథకాల కు శుభారంభం జరిగింది. ఈ పథకాల లో త్రాగునీరు, ఆరోగ్యం, విద్య, గంగ నది శుద్ధి, వరదల నియంత్రణ, రక్షకభట సంబంధి సేవలు మరియు క్రీడల సంబంధి సేవలు మొదలైనవి ఉన్నాయి అని ఆయన అన్నారు. బిహెచ్ యు లో మెషీన్ టూల్స్ డిజైన్ కు సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ప్రపంచ ప్రమాణాల ను కలిగి ఉండే మరొక సంస్థ ను ఈ నగరాని కి జోడిస్తుంది అని కూడా ఆయన అన్నారు. ఈ రోజు న తెర మీద కు వచ్చినటువంటి అభివృద్ధి పథకాల కు గాను వారాణసీ మరియు పూర్వాంచల్ ప్రజల కు అభినందనల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

కాశీ అభివృద్ధి ని గురించి అంతటా చర్చించుకోవడం జరుగుతోంది, మరి ప్రతి ఒక్క సందర్శకుడు/ప్రతి ఒక్క సందర్శకురాలు సరికొత్త శక్తి తో తిరిగి వెళ్తున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజల భయాందోళనల ను కాశీ అధిగమించడం తో పాటుగా నగరం యొక్క రూపురేఖ లను మార్చివేయడం లో కూడా సఫలీకృతం అయింది అని ఆయన అన్నారు.

|

కాశీ లో పాత కాశీ ని మరియు కొత్త కాశీ ని ఏక కాలం లో దర్శించవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు. కాశీ విశ్వనాథ్ ధామ్, గంగ నది యొక్క ఘాట్ ల పనుల తో పాటు అతి పొడవైన నదీవిహారం వంటి వాటి ప్రసక్తి ప్రపంచం అంతటా మారుమోగుతోంది అని ఆయన అన్నారు. కేవలం ఒక సంవత్సర కాలం లో 7 కోట్ల మంది కి పైగా సందర్శకులు కాశీ ని సందర్శించారు. ఈ యాత్రికులు నగరం లో ఉపాధి తో పాటు సరిక్రొత్త ఆర్థిక అవకాశాల ను కూడా అందిస్తున్నారు అని ఆయన అన్నారు.

పర్యటన కు మరియు నగర సుందరీకరణ కు సంబంధించిన నూతన అభివృద్ధి పథకాల ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ‘‘రహదారులు కావచ్చు, వంతెనలు కావచ్చు, రైలు మార్గాలు లేదా విమానాశ్రయాలు కావచ్చు - వాటితో వారాణసీ కి కనెక్టివిటీ పూర్తి గా సులభతరం గా మారింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సరిక్రొత్తదైన రోప్ వే ప్రాజెక్టు నగరం లో కనెక్టివిటీ ని ఒక నవీన స్థాయి కి తీసుకుపోనుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది యాత్రికుల కు ఒక కొత్త ఆకర్షణ ను ఇవ్వడం తో పాటు నగరం లో సదుపాయాల ను మరో మెట్టు పైకి తీసుకు పోతుంది అని ఆయన తెలిపారు. రోప్ వే నిర్మాణం ఒకసారి పూర్తి అయింది అంటే ఇక అప్పుడు బనారస్ కంటోన్మెంట్ రైల్ వే స్టేశన్ కు మరియు కాశీ-విశ్వనాథ్ కారిడార్ కు మధ్య దూరం నిమిషాల వ్యవధి కి పరిమితం అయిపోతుంది; అంతేకాదు, కంటోన్మెంట్ స్టేశన్ మరియు గోదౌలియా మధ్య ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది అని ఆయన వివరించారు.

|

చుట్టుప్రక్కల నగరాల నుండి మరియు రాష్ట్రాల నుండి ఇక్కడకు వచ్చే ప్రజలు తక్కువ కాలం లో నగరాన్ని చుట్టి రాగలుగుతారు అని ప్రధాన మంత్రి చెప్పారు. రోప్ వే కోసం జత చేసే ఆధునిక సదుపాయాలు ఆర్థిక కార్యకలాపాల తాలూకు ఒక కొత్త కేంద్రాన్ని ఏర్పరుస్తాయి అని ఆయన స్పష్టం చేశారు.

బాబత్ పుర్ విమానాశ్రయం లో సరిక్రొత్త ఎటిసి టవర్ కాశీ కి వాయు మార్గ సంధానాన్ని బలపరచడం కోసం చేపట్టిన చర్య అని ప్రధాన మంత్రి వివరించారు. ఫ్లోటింగ్ జెట్టి ని అభివృద్ధి పరుస్తున్న సంగతి ని ఆయన ప్రస్తావించి, తీర్థయాత్రికుల అవసరాల ను మరియు పర్యటకుల అవసరాల ను తీర్చడమే దీనిలోని ప్రధాన ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు. నమామి గంగే మిశన్ లో భాగం గా గంగ నది తీరాన అన్ని నగరాల లో మురుగునీటి శుద్ధి సంబంధి నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడమైంది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. ‘‘గడచిన 9 సంవత్సరాల లో గంగ ఘాట్ ల ముఖచిత్రం లో వచ్చిన మార్పు ను ప్రతి ఒక్కరు గమనించారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. గంగ నది కి రెండు ప్రక్కల ఒక వినూత్న పర్యావరణ పరమైన ప్రచార ఉద్యమం సాగుతున్నది. దీని లో భాగం గా ప్రభుత్వం అయిదు కిలో మీటర్ ల మేర ప్రాకృతిక వ్యవసాయాని కి ప్రోత్సాహాన్ని అందిస్తోందని ఆయన వివరించారు. దీని కోసం ఈ సంవత్సరం బడ్జెటు లో ప్రత్యేకంగా కేటాయింపు చేయడమైందని ఆయన అన్నారు. ప్రాకృతిక వ్యవసాయం విషయానికి వస్తే, క్రొత్త కేంద్రాల ను అభివృద్ధి పరచి మరీ రైతుల కు సహాయం అందించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

|

కేంద్రం లోని, ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వాలు పేదల సేవను విశ్వసిస్తున్నాయని, ప్రజలు తనను 'ప్రధాన మంత్రి' అని పిలిచినప్పటికీ, తాను మాత్రం ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నట్టు నమ్ముతున్నానని ప్రధాన మంత్రి అన్నారు. ఇంతకుముందు వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో తాను జరిపిన సంభాషణలను గుర్తు చేసుకున్న ప్రధాని, వారణాసికి చెందిన వేలాది మంది పౌరులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. 2014కు ముందు బ్యాంకు ఖాతా తెరవడం చాలా క్లిష్టమైన పని అని, నేడు దేశంలో నిరుపేదలకు కూడా జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, చెల్లింపుల రూపంలో సహాయాన్ని ప్రభుత్వం నేరుగా ఆ ఖాతాలలో జమ చేస్తోందని ప్రధాని తెలిపారు. "చిన్న రైతు అయినా, వ్యాపారవేత్త అయినా, మహిళా స్వయం సహాయక సంఘాలైనా ముద్ర యోజన ద్వారా రుణం పొందడం చాలా సులభమైంది" అని ప్రధాన మంత్రి అన్నారు. పశువులు, చేపల పెంపకందారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని, వీధి వ్యాపారులు పీఎం స్వనిధి యోజన ద్వారా రుణాలు అందు కుంటున్నారని, భారత దేశం లోని విశ్వకర్మలకు పీఎం-విశ్వకర్మ యోజనను ప్రవేశపెట్టామని తెలిపారు. "అమృత్ కాల్ లో భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రతి పౌరునికి సహకారం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది , ఎవరూ వెనుకబడరు" అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

లక్ష మంది అథ్లెట్లు పాల్గొన్న ఖేలో బనారస్ పోటీల విజేతలతో తాను జరిపిన ముఖాముఖిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇందులో పాల్గొన్న వారిని, విజేతలను ప్రధాని అభినందించారు. బెనారస్ యువతకు కొత్త క్రీడా సౌకర్యాలను గురించి ఆయన ప్రస్తావించారు.  సిగ్రా స్టేడియం ఫేజ్ 2, 3 విస్తరణకు నేడు శంకుస్థాపన జరిగింది. వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతోందని కూడా ఆయన తెలిపారు.

|

"ఈ రోజు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రతి అభివృద్ధి రంగానికి కొత్త కోణాలను జోడిస్తోంది" అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం రేపు, మార్చి 25 న రెండవ పదవీకాలానికి మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటోందని, శ్రీ యోగి రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా కొత్త రికార్డు సృష్టించారని ఆయన పేర్కొన్నారు. "ఉత్తరప్రదేశ్ నిరాశ ఛాయల నుండి బయటపడింది. ఇప్పుడు తన ఆకాంక్షలు, ఆశయాల మార్గంలో నడుస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు. భద్రత, సేవాభావానికి ఉత్తర్ ప్రదేశ్ స్పష్టమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రసంగాన్ని ముగించిన ప్రధాన మంత్రి, ఈ రోజు ప్రారంభించిన నూతన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రగతి మార్గాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరినీ మరోసారి అభినందించారు.

|

ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ అనాదిబెన్ పటేల్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ , ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు ఈ కార్యక్రమానికి

హాజరయ్యారు.

|

నేపథ్యం

గత తొమ్మిదేళ్లలో వారణాసి రూపురేఖలను మార్చడం, నగరం, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచడంపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించారు. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ, సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని రూ.1780 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ప్రధాన మంత్రి వారణాసి కంటోన్మెంట్

స్టేషన్ నుంచి గొడోలియా వరకు ప్యాసింజర్ రోప్ వే కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.645 కోట్లు. రోప్ వే వ్యవస్థ ఐదు స్టేషన్లతో 3.75 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనివల్ల పర్యాటకులు, యాత్రికులు, వారణాసి వాసులకు రాకపోకలు సులభతరం అవుతాయి.

నమామి గంగ పథకం కింద భగవాన్ పూర్ లో రూ.300 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న 55 ఎంఎల్ డీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ కు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా సిగ్రా స్టేడియం పునర్నిర్మాణ 2, 3 దశల పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సేవాపురిలోని ఇసార్వార్ గ్రామంలో నిర్మించనున్న ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంట్ కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. భర్తర గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మారే గదులతో కూడిన ఫ్లోటింగ్ జెట్టీ సహా పలు ఇతర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

జల్ జీవన్ మిషన్ కింద 63 గ్రామ పంచాయతీల్లోని 3 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చే 19 మంచినీటి పథకాలను ప్రధాని అంకితం చేశారు. గ్రామీణ మంచినీటి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, మిషన్ కింద మరో 59 మంచినీటి పథకాలకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

వారణాసి చుట్టుపక్కల గల రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారుల కోసం కార్ఖియాన్ వద్ద నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ లో పండ్లు, కూరగాయల గ్రేడింగ్, సార్టింగ్, ప్రాసెసింగ్ సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా ప్రధాని ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఇది వారణాసి , పరిసర ప్రాంతాల వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి సహాయపడుతుంది.

వారణాసి స్మార్ట్ సిటీ మిషన్ కింద రాజ్ ఘాట్, మహ్మూర్ గంజ్ ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణ పనులు,  అంతర్గత నగర రహదారుల సుందరీకరణ; నగరంలోని 6 పార్కులఅభివృద్ధి, చెరువుల పునర్నిర్మాణం సహా

వివిధ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి అంకితం చేశారు.  లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏటీసీ టవర్ , భేలుపూర్ లోని వాటర్ వర్క్స్ ఆవరణలో 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్; కోనియా పంపింగ్ స్టేషన్ వద్ద 800 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్; సారనాథ్ వద్ద కొత్త కమ్యూనిటీ హెల్త్ సెంటర్; చాంద్ పూర్ లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ యొక్క మౌలిక సదుపాయాల మెరుగుదల; కేదారేశ్వర్, విశ్వేశ్వర్, ఓంకారేశ్వర్ ఖండ్ పరిక్రమ తదితర ఆలయాల పునరుద్ధరణ సహా పలు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన అంకితం చేశారు.

వారాణసీ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతాలన్నీ వ్యవసాయాని కి మరియు వ్యవసాయ సంబంధి ఎగుమతుల కు ఒక కేంద్రం వలె మారుతున్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారాణసీ లో ఏర్పాటైన ప్రాసెసింగ్, రవాణా మరియు నిలవ సదుపాయాల ను గురించి ఆయన ప్రస్తావించి, ఆ సదుపాయాలు వారాణసీ లో ‘లంగ్ డా’ రకం మామిడి పండ్లు; ఘాజీపుర్ రకం ‘బెండకాయలు’, ‘పచ్చి మిర్చి’; జౌన్ పుర్ రకం ‘ముల్లంగి, ఖర్బూజా’ లు అంతర్జాతీయ బజారుల కు చేరుకోవడానికి నవీన జవసత్త్వాల ను సమకూర్చుతున్నాయన్నారు.

స్వచ్ఛమైన త్రాగునీటి అంశాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంచుకొన్న అభివృద్ధి మార్గం లో సేవ, సానుభూతి .. ఈ రెండూ జతపడ్డాయన్నారు. స్వచ్ఛమైన త్రాగునీటి కి సంబంధించి అనేక పథకాల కు ఈ రోజు న శంకుస్థాపన జరిగింది అంతేకాకుండా వివిధ పథకాల ను ప్రారంభించడమైంది అన్నారు. ‘హర్ ఘర్ నల్ సే జల్’ (అంటే ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీటి సరఫరా) ప్రచార ఉద్యమాన్ని గురించి ఆయన ప్రముఖం గా పేర్కొంటూ, దేశం లో 8 కోట్ల కుటుంబాలు గత మూడు సంవత్సరాల లో నల్లా ద్వారా నీటి సరఫరా ను పొందాయని వివరించారు. ఉజ్జ్వల యోజన ను గురించి ఆయన ప్రస్తావిస్తూ, సేవాపురీ లో ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంటు లబ్ధిదారుల కు ప్రయోజనకరం గా ఉండడం ఒక్కటే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతం లో, బిహార్ లోని పశ్చిమ ప్రాంతం లో గ్యాస్ సిలిండర్ ల సంబంధి అవసరాల ను కూడా తీర్చుతుందని తెలిపారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  • ferozabi Khalid Shaikh October 21, 2024

    go
  • Reena chaurasia August 29, 2024

    bjp
  • Anand Prasad kushwaha April 16, 2023

    पौधे लगाने के लिएप्रेरित करता आनन्द प्रसाद कुशवाहा गांधीनगर तेलीबाग लखनऊ उत्तर प्रदेश ब्रांड
  • Anand Prasad kushwaha April 16, 2023

    घर-घर पौधा,घर घर पौधा, पेड़ पौधे लगाने के लिएप्रेरित करता आनन्द प्रसाद कुशवाहा गांधीनगर तेलीबाग लखनऊ उत्तर प्रदेश ब्रांड एंबेसडर (Anand Prasad kushvaha)
  • AnAnd Sonawane April 09, 2023

    AnAnd Stoneware
  • Sangeeta Sharma April 02, 2023

    बिजली और पानी का संकट ख़ासकर गर्मी मे ही होती हैं हमारे यहाँ भी टिस्को जुस्को सिर्फ अपने छेत्र मे ही 24 घंटे बिजली पानी की सुविधा देती है बाकी जगह परसुडीह बागबेडा़ करनडीड आदियपुर मानगो कदमा बारीडीह बिरसानगर और भी बहुत सारे एरिया मे डी बी सी एरिया मे बिजली पानी का संकट आज भी है गैलन से पानी खरीदना पड़ता है या टैंकर आती है मच्छर का प्रकोप भयंकर नाम का सिर्फ मिनी मुम्बई कहलाता है जमशेदपुर पश्चिम विधान सभा में इतने नेता जीत कर आये और गये पर आज तक ना तो एम जी एम अस्पताल को सुधार पाये और ना गर्मी मे बिजली पानी के संकट को वादा तो बडे़ बडे़ सबने किऐ झारखण्ड मे खनिज संपदा पैसो की कमी नही पर आज के वक्त मे सबसे पिछड़ा गरीब सब बिहार झारखण्ड मे ही मिलेंगे नेता सिर्फ अमीर बनते जाते है सरकार बनते ही जनता वही के वही है आज भी
  • Sohan Singh March 31, 2023

    om namo narayan jai Hind
  • Aniket Malwankar March 31, 2023

    #Baba
  • CHANDRA KUMAR March 31, 2023

    कर्नाटक चुनाव जीतने के लिए बीजेपी को कुछ विशेष कार्य करना चाहिए 1. सबसे पहले केंद्र सरकार को 5000 कन्नड़ भाषा शिक्षक का नियुक्ति के लिए नोटिफिकेशन निकाल देना चाहिए। 2. कन्नड़ भाषा विश्वविद्यालय का स्थापना के लिए शिलान्यास कर दीजिए। 3. कर्नाटक में स्ट्रीट फूड का आनंद लीजिए और आम नागरिकों से सीधा जुड़ने का प्रयास कीजिए। 4. कर्नाटक इतिहास से जुड़ी ऐतिहासिक सामान, पुस्तक, मूर्ति आदि का प्रदर्शनी का आयोजन करवाइए। 5. कर्नाटक के विद्यालयों में भ्रमण कीजिए, छात्रों से संवाद कीजिए। 6. कर्नाटक की लडकियों को संगीत, नृत्य, कला, सॉफ्ट स्किल की शिक्षा के लिए 5000 रुपए छात्रवृत्ति की घोषणा कीजिए। 7. कर्नाटक में, प्रत्येक जिला में गरीब वृद्ध स्त्री पुरुष को, कपड़ा वितरण करवाइए। यह अनुदान का कार्य आरएसएस के द्वारा किया जाए, ताकि आचार संहिता उल्लंघन का आरोप नहीं लग सके। बीजेपी को कांग्रेस पार्टी की रणनीति समझ में ही नहीं आ रहा है। कांग्रेस पार्टी का एकमात्र उद्देश्य है अपना अस्तित्व बचाना। दक्षिण भारत से वापसी करना। लेकिन बीजेपी को कोई मौका नहीं देना चाहिए। कांग्रेस पार्टी के तीन रणनीति को तत्काल असफल कीजिए 1. बीजेपी अडानी को सरकारी पैसा देती है और अडानी चुनाव में बीजेपी का मदद करता है। बीजेपी को एक योजनाबद्ध तरीके से इसका जवाब देना चाहिए। a) ग्लोबलाइजेशन और निवेश के नाम पर देश में विदेशी कंपनियों को बुलाया, और इसीलिए आज देश में भारतीय कंपनी खत्म होता जा रहा है। बीजेपी भारतीय कंपनियों को बचाने का प्रयास कर रही है। परिवार में यदि बड़ा बेटा ज्यादा कमाने लगता है तो उसे घर से भगाते नहीं है, बल्कि उससे कहते हैं की परिवार को मजबूत बनाओ, सबके हित में काम करो। यदि देश की कुछ कंपनी अच्छा प्रदर्शन कर रही है, उन्नति कर रही है, तो क्या इन कंपनियों को नष्ट कर दें। विदेशी कंपनियों को ही सहायता करते रहना कांग्रेस पार्टी का लक्ष्य था। लेकिन बीजेपी स्वदेशी कंपनियों की मदद करके उसे मल्टीनेशनल करके मल्टीब्यूजनेस में आगे बढ़ा रही है। बीजेपी ने स्टार्ट अप को भी आगे बढ़ाया है। बीजेपी किसी भी कंपनी के साथ पक्षपात नहीं कर रही है। इतना ही नहीं, बीजेपी को सभी प्राइवेट कंपनी का मीटिंग बुलाना चाहिए। सभी प्राइवेट कंपनी को एक सिस्टम बनाकर स्थाई रोजगार की घोषणा करने के लिए प्रेरित करना चाहिए। TA DA देना चाहिए , बीजेपी को यह दिखाना चाहिए की कांग्रेस पार्टी भारतीय कंपनियों का दुश्मन है और विदेशी कंपनियों का सहायक है। अडानी और अंबानी से कांग्रेस पार्टी को इसीलिए परेशानी है क्योंकि यह कंपनी भारतीय है, तेजी से विकसित हो रही है, मल्टीनेशनल बन गई है, और मल्टी बिजनेस को अपना रही है। सत्ता में रहते हुए कांग्रेस पार्टी ने पतंजलि कंपनी के साथ सौतेला व्यवहार किया था ! बीजेपी देश की सभी कंपनी को समान अवसर दे रही है। बीजेपी ने देश में कई स्टार्ट अप को आगे बढ़ाया है,जिसे देखकर कांग्रेस पार्टी पागल ही गई है। भारत में आकर विदेशी कंपनी, बिजनेस करके बड़ा हो जाता हैं तब कांग्रेस पार्टी को कोई दिक्कत नहीं होता है। लेकिन भारत की कंपनी विदेश जाकर अपना विस्तार करता है तब कांग्रेस पार्टी के पेट का पानी नहीं पचता है। कांग्रेस पार्टी को अडानी अंबानी से लड़ाई नहीं है, बल्कि हर तरह के विकसित भारतीय तत्वों से कांग्रेस पार्टी नफरत करती है। अब बीजेपी को देश की सभी राष्ट्रीय कंपनियों की सूची बनाकर देश की जनता के सामने रखना चाहिए, किस कंपनी ने कितना रोजगार दिया है और कितना रोजगार देने वाला है, इसका सूची जारी करना चाहिए! 2. राहुल गांधी को जेल भेजना, बीजेपी को दोष दिया जा रहा है की अंबानी अडानी का विरोध करने की वजह से ही राहुल गांधी को जेल भेजा गया। राहुल गांधी ने मोदी जाति को चोर कहा। इससे पहले राहुल गांधी ने ब्राह्मणों को दलितों पर अत्याचार करने वाला कहा था। कांग्रेस पार्टी अलग अलग समय में, अलग अलग स्थान पर, अलग अलग जाति को निशाने (Target) पर लेती है और समाज में विद्वेष पैदा करती है। राहुल गांधी भी जातिवाद को बढ़ाकर देश को बरबाद करना चाहता है, दंगा करवाना चाहता है। राहुल गांधी हिंदुओं को जातियों में तोड़कर वोट का फसल काटना चाहता है। कांग्रेस पार्टी जातिगत जनगणना भी इसी उद्देश्य से करवाना चाहता है ताकि देश जातिवाद का जहर फैलाया जाए। देश को बरबाद करके देश को लूटना कांग्रेस पार्टी का पुराना व्यवसाय है। 3. बीजेपी दक्षिण भारत को इग्नोर करता है, डबल इंजिन के नाम पर राज्य को केंद्र सरकार कंट्रोल करता है। सभी बीजेपी शासित राज्य में केंद्र सरकार की योजना को लागू करे और उस योजना के खर्च को बढ़ा दे। इससे योजना का प्रभाव ज्यादा दिखेगा। बीजेपी बहुत ही मामूली काम करके देश की जनता को खुश कर सकता है। न कोई अतिरिक्त खर्च होगा और न ही कोई अतिरिक्त संसाधन लगेगा, बस थोड़ा सा इच्छाशक्ति चाहिए। a) सबसे पहले बीजेपी को नशामुक्त भारत की घोषणा कर देना चाहिए। भारत का नशीला पदार्थ विदेशों में बेचा जा सकता है, लेकिन कोई भी नशीला पदार्थ का आयात नहीं किया जायेगा। भारतीयों को नशीला पदार्थ का सेवन करने से रोका जाए। तस्करी बढ़ने का संदेह सही हो सकता है लेकिन तस्करी के डर से अच्छा निर्णय नहीं ले, यह भी तो उचित नहीं है। b) खाद्य पदार्थों पर से टैक्स हटा लिया जाए, ताकि सभी खाद्य पदार्थ सस्ता हो जाए। c) पेट्रोलियम उत्पाद को सस्ता कर दिया जाए। d) विदेशी कंपनी को देश से बाहर करने का घोषणा कर दिया जाए। अब भारत में केवल भारतीय कंपनी का ही वर्चस्व होगा। e) देश में केवल अच्छा उत्पाद ही बिकेगा, नागरिकों के शारीरिक मानसिक स्वास्थ्य को नुकसान पहुंचाने वाले सामान को बिकने से रोका जाए। f) देश के नागरिकों के लिए एक वेबसाइट बनाया जाए। सभी भारतीय नागरिकों से आग्रह किया जाए, अपना वोटर आईडी नंबर डालकर, किस सरकारी योजना का लाभ आपको मिला, और किस सरकारी योजना का लाभ आपको नहीं मिला, उसपर मार्किंग कीजिए। इस सर्वे में जिन भारतीय नागरिकों को एक भी योजना का लाभ नहीं मिला हो, उनके बैंक अकाउंट में एक हजार रुपए भेजा जाए। इससे भारतीय नागरिकों के हाथ में पैसा जायेगा, मार्केट में पैसा का फ्लो बढ़ेगा, देश का आर्थिक स्थिति बेहतर होगा। इस सर्वे में यह मालूम हो जायेगा की किन सरकारी योजना पर व्यर्थ में पैसा बरबाद हो रहा है, उसे बंद करके दूसरी योजना प्रारंभ किया जाए। सरकारी योजना को लागू नहीं करने के आधार पर, कार्रवाई शुरू किया जाए, दंड और प्रोत्साहन ही सरकारी योजना को जनता तक पहुंचा सकता है और सरकार को जनता से जोड़ सकता है। मोदीजी को सभी उद्योगपति से मीटिंग करना चाहिए, जनता को लगना चाहिए की मोदीजी सभी उद्योगपति को आगे बढ़ाना चाहता है, केवल अडानी अंबानी को ही नहीं। साप्ताहिक मीटिंग देश के व्यवसायियों के साथ किया जाना चाहिए। सभी जिला उपायुक्त को निर्देश दिया जाए की वह अपने अपने जिले में व्यवसायियों के साथ प्रत्येक सप्ताह मीटिंग करे, उनकी समस्या को दूर करे, और व्यवसाय बढ़ाने में भागीदार बने। 4. भारतीय मुद्रा का मूल्य बढ़ा दिया जाए, इससे कम मुद्रा देकर ज्यादा पेट्रोलियम का आयात किया जा सकेगा। देश के मंदिरों के स्वर्ण तथा वक्फ बोर्ड के संपत्ति पर भी मुद्रा जारी किया जाए। 5. देश में 10000 न्यायाधीश की नियुक्ति के लिए यूपीएससी को विज्ञापन जारी करने का निर्देश दिया जाए। यदि न्यायपालिका और विपक्ष विरोध करे की यूपीएससी द्वारा न्यायाधीश का नियुक्ति नहीं करना चाहिए। तब बीजेपी को जनता के बीच कहना चाहिए की कॉलेजियम और कांग्रेस जनता को न्याय से वंचित कर रही है। देश में लंबित मुकदमे को खत्म करने तथा देश की जनता को न्याय दिलाने का प्रयास बीजेपी सरकार कर रही है। दस हजार न्यायाधीशों की नियुक्ति में, सभी एलएलबी किए हुए भारतीय नागरिक को आवेदन देने का मौका दिया जाए। इसमें यूपीएससी द्वारा प्रश्नपत्र में रीजनिंग, सामान्य ज्ञान, सामान्य गणित, भारतीय तथा विश्व न्याय व्यवस्था, भारतीय संविधान आदि से प्रश्न पूछा जाए। इसमें इंटरव्यू नहीं रखा जाए, जिससे सामान्य गरीब परिवार के बच्चे को इंटरव्यू में छटने से रोका जा सके। इस तरह कॉलेजियम सिस्टम का महत्व घटेगा, देश में रोजगार बढ़ेगा। अब न्यायाधीशों का स्थानांतरण में, उन न्यायाधीश को प्राथमिकता दिया जाए, जो अच्छा न्याय करता है। न्यायाधीश का प्रमोशन में उन्हें प्राथमिकता दिया जाए जो फैसला सुनाने में निष्पक्ष है और फैसला मिलने के बाद वादी प्रतिवादी संतुष्ट हो जाता है और उच्च न्यायालय में अपील नहीं करता है। इस तरह से कॉलेजियम सिस्टम का महत्व घटेगा और सरकार का माहत्व बढ़ेगा। आज कॉलेजियम सिस्टम के माध्यम से चंद्रचूड़ जैसा न्यायाधीश कांग्रेस पार्टी के समर्थन में सुप्रीम कोर्ट का उपयोग कर रहा है।
  • HARISH ARORA March 29, 2023

    जय हो 🇮🇳🚩🇮🇳🚩
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How has India improved its defence production from 2013-14 to 2023-24 since the launch of

Media Coverage

How has India improved its defence production from 2013-14 to 2023-24 since the launch of "Make in India"?
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM speaks with HM King Philippe of Belgium
March 27, 2025

The Prime Minister Shri Narendra Modi spoke with HM King Philippe of Belgium today. Shri Modi appreciated the recent Belgian Economic Mission to India led by HRH Princess Astrid. Both leaders discussed deepening the strong bilateral ties, boosting trade & investment, and advancing collaboration in innovation & sustainability.

In a post on X, he said:

“It was a pleasure to speak with HM King Philippe of Belgium. Appreciated the recent Belgian Economic Mission to India led by HRH Princess Astrid. We discussed deepening our strong bilateral ties, boosting trade & investment, and advancing collaboration in innovation & sustainability.

@MonarchieBe”