ఎఐఐఎమ్ఎస్, జోధ్ పుర్ లో ‘ట్రామా సెంటర్ ఎండ్ క్రిటికల్ కేయర్ హాస్పిటల్ బ్లాకు’ కు మరియు ఏడు క్రిటికల్ కేర్ బ్లాకుల కు ఆయనశంకుస్థాపన చేశారు
జోధ్ పుర్ విమానాశ్రయం లో క్రొత్త టర్మినల్ బిల్డింగుకు కూడా శంకుస్థాపన చేశారు
ఐఐటి జోధ్ పుర్ కేంపస్ ను మరియు రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో ఉన్నతీకరించిన మౌలిక సదుపాయాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు
పలు రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేశారు
డబ్లింగ్ పూర్తి అయిన 145 కిలో మీటర్ ల పొడవైన డెగానా - రాయ్ కా బాగ్ రైలు లైను ను మరియు 58 కి.మీ. పొడవైన డెగానా - కుచామన్ సిటీ రైలు లైను లను దేశ ప్రజల కు అంకితం చేశారు
జైసల్ మేర్ ను దిల్లీ తో కలిపే రుణిచా ఎక్స్ ప్రెస్ కు మరియు మార్ వాడ్ జంక్శన్ - ఖాంబ్ లీ ఘాట్ ను కలిపే క్రొత్త హెరిటేజ్ ట్రేను కు ప్రారంభ సూచక పచ్చజెండా ను చూపారు
‘‘రాజస్థాన్ ఎటువంటి రాష్ట్రం అంటే అక్కడ దేశం యొక్క పరాక్రమం, సమృద్ధి మరియు సంస్కృతి లలో ప్రాచీన భారతదేశం యొక్క వైభవం కనిపిస్తుంది’’
‘‘భారతదేశం యొక్క గత వైభవాని కి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ మరి భారతదేశం యొక్క భవిష్యత్తు కు కూడా ప్రాతినిధ్యాన్ని వహించడం ముఖ్యం’’
‘‘ఎఐఐఎమ్ఎస్ జోధ్ పుర్, ఇంకా ఐఐటి జోధ్ పుర్ లు ఒక్క రాజస్థాన్ లోనే కాకుండా దేశం లోని అగ్రగామి సంస్థ ల సరసన నిలవడాన్ని చూస్తే నాకు సంతోషం కలుగుతుంది’’
‘‘రాజస్థాన్ యొక్క అభివృద్ధి తోనే భారతదేశం పురోగమిస్తుంది’’

రహదారులు, రైలు మార్గాలు, విమానయానం, ఆరోగ్యం మరియు ఉన్నత విద్య వంటి రంగాల లో సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన అనేక ప్రాజెక్టుల కు రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేయడం తో పాటు, వాటిని దేశ ప్రజల కు అంకితమిచ్చారు.  ఆ ప్రాజెక్టుల లో ఎఐఐఎమ్ఎస్, జోధ్ పుర్ లో 350 పడకల తో కూడిన ట్రామా సెంటర్ ఎండ్ క్రిటికల్ కేయర్  హాస్పిటల్ బ్లాకు కు ప్రధాన మంత్రి - ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ (పిఎమ్-ఎబిహెచ్ఐఎమ్) మ్ లో భాగం గా నిర్మాణం కానున్న  7 క్రిటికల్ కేయర్ బ్లాకు లు, జోధ్ పుర్ విమానాశ్రయం లో క్రొత్త టర్మినల్ బిల్డింగు అభివృద్ధి వంటివి కొన్ని.  ఆయన ఐఐటి, జోధ్ పుర్ కేంపస్ ను మరియు రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో ఉన్నతీకరణ పూర్తి అయినటువంటి మౌలిక సదుపాయల ను దేశ ప్రజల కు అంకితం చేశారు.  అనేక రహదారి అభివృద్ధి సంబంధి ప్రాజెక్టుల ను శంకుస్థాపన చేయడం తో పాటు 145 కిలో  మీటర్ ల పొడవైన డెగానా - రాయ్ కా బాగ్  మరియు 58 కిమీ పొడవైన డెగానా- కుచామన్ సిటీ రైలు లైను లను వాటి డబ్లింగు పనులు పూర్తి కావడం తో దేశ ప్రజల కు అంకితం చేశారు. రెండు క్రొత్త ట్రేన్ సర్వీసుల కు శ్రీ నరేంద్ర మోదీ ఆకుపచ్చజెండా ను చూపి వాటి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ రైళ్లు ఏవేవంటే అవి జైసల్ మేర్ ను దిల్లీ తో కలిపే రుణిచా ఎక్స్ ప్రెస్, ఇంకా మార్ వాడ్ జంక్శను ను, ఖాంబ్ లి ఘాట్ ను కలిపే ఒక క్రొత్త హెరిటేజ్ ట్రేన్.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, వీర్ దుర్గాదాస్ పుట్టిన గడ్డ కు ప్రణామాన్ని ఆచరించి, శ్రద్ధాంజలి ఘటించారు.  ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయాసల ఫలితాల ను ఈ రోజు న ప్రారంభించుకొంటున్న ప్రాజెక్టుల ను చూసి తెలుసుకోవచ్చును అని ఆయన స్పష్టం చేశారు.  ఈ ప్రాజెక్టుల కు గాను రాజస్థాన్ ప్రజల కు అభినందనల ను తెలియజేశారు. 

 

 

దేశం యొక్క పరాక్రమం, సమృద్ధి మరియు సంస్కృతి లు కానవచ్చే ప్రాచీన భారతదేశం యొక్క వైభవాన్ని రాజస్థాన్ రాష్ట్రం లో చూడవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు.  ఇటీవల జోధ్ పుర్ లో జరిగిన ఎన్నో ప్రశంసలు పొందిన జి-20 సమావేశాన్ని  కూడా ఆయన ఈ సందర్భం లో గుర్తు కు తెచ్చారు.  సన్ సిటీ గా ప్రసిద్ధికెక్కిన జోధ్ పుర్ దేశంలోని యాత్రికులకే కాక ప్రపంచ దేశాల యాత్రికుల కు కూడా ఆకర్షణ గా నిలుస్తోంది అని ఆయన నొక్కిపలికారు.  ‘‘భారతదేశం యొక్క గత కాలపు వైభవాని కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజస్థాన్ భారతదేశం యొక్క భవిష్యత్తు కు సైతం ప్రాతినిధ్యం వహించడం ముఖ్యం.  ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మేవాడ్ నుండి మార్ వాడ్ వరకు యావత్తు రాజస్థాన్ అభివృద్ధి లో క్రొత్త శిఖరాల ను అందుకొన్నప్పుడు, ఇక్కడ ఆధునిక మౌలిక సదుపాయాలు కొలువుదీరినప్పుడూను.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.  

 

 

బీకానేర్ మరియు బాడ్ మేర్ ల గుండా సాగిపోయేటటువంటి జామ్ నగర్ ఎక్స్ ప్రెస్ వే, ఇంకా దిల్లీ ముంబయు ఎక్స్ ప్రెస్ వే లు రాజస్థాన్ లోని అత్యంత ఆధునికమైన సాంకేతిక విజ్ఞానం తో జతపడ్డ మౌలిక సదుపాయాల కు ఉదాహరణలు గా ఉన్నాయని ఆయన అన్నారు.

 

 

ఈ సంవత్సరం లో రాజస్థాన్ లో రైల్ వే లకు దాదాపు గా 9500 కోట్ల రూపాయల బడ్జెటు ను కేటాయించడమైంది.  అది మునుపటి ప్రభుత్వాల సరాసరి బడ్జెటు కంటే 14 రెట్లు ఎక్కువ గా ఉంది అని ప్రధాన మంత్రి తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం 2014 వ సంవత్సరం వరకు చూసుకొంటే రాజస్థాన్ లో 600 కి.మీ. మేరకు రైలు మార్గాల విద్యుదీకరణ జరగగా, ప్రస్తుత ప్రభుత్వం గడచిన తొమ్మిది సంవత్సరాల లో ఇప్పటికే 3,700 కి.మీ. కి పైచిలుకు రైలు మార్గాల ను విద్యుదీకరించింది అని ప్రధాన మంత్రి చెప్పారు.  ‘‘ఈ రైలు పట్టాల మీదుగా డీజిల్ ఇంజిన్ రైళ్ళ కు బదులు ఇప్పుడు విద్యుత్తు తో నడిచే రైళ్ళు పరుగులు పెడతాయి’’ అని ఆయన అన్నారు.  ఇది కాలుష్యాన్ని తగ్గించడం లో సహాయకారి కావడంతో పాటుగా రాష్ట్రం లో గాలి ని స్వచ్ఛం గా కూడాను ఉంచుతుంది అని ఆయన అన్నారు.  అమృత్ భారత్ స్టేశన్ స్కీము లో భాగం గా 80 కి పైగా రేల్ వే స్టేశన్ లను రాజస్థాన్ లో సరిక్రొత్త గా తీర్చిదిద్దడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.  దేశం లో విమానాశ్రయాల అభివృద్ధి మాదిరి గానే పేదలు తరచుగా రాకపోకల ను సాగించే రేల్ వే స్టేశన్ లను పునరభివృద్ధి పరచాలని ప్రభుత్వం కంకణం కట్టుకొందని ఆయన పునరుద్ఘాటించారు.  జోధ్ పుర్ రేల్ వే స్టేశన్ పునరభివృద్ధి పనుల కు శంకుస్థాపన జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

 

ఈ రోజు న చేపట్టిన రైలు రంగ ప్రాజెక్టు లు మరియు రహదారి రంగ ప్రాజెక్టు లు రాష్ట్రం లో అభివృద్ధి గతి కి వేగాన్ని జత చేస్తాయి అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.  రైలు మార్గాల డబ్లింగు తో రైళ్ళ లో ప్రయాణించేందుకు పడుతున్న కాలం తగ్గుతుంది అని ఆయన తెలిపారు.   జైసల్ మేర్, దిల్లీ ల మధ్య రుణిచా ఎక్స్ ప్రెస్ కు, మరి అలాగే మార్ వాడ్ జంక్శన్, ఖాంబ్ లీ ఘాట్ ల మధ్య ఒక క్రొత్త హెరిటేజ్ ట్రేన్ కు ఈ రోజు న ప్రారంభోత్సవం జరపడాన్ని గురించి ఆయన ప్రస్తావించారు.  ఈ రోజు న మూడు రోడ్డు ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం గురించి, అలాగే జోధ్ పుర్ విమానాశ్రయం లో క్రొత్త టర్మినల్ బిల్డింగ్ అభివృద్ధి గురించి కూడా ఆయన మాట్లాడారు.  ఈ రోజు న ఆరంభించిన ప్రాజెక్టు లు క్రొత్త ఉపాధి అవకాశాల ను కూడా కల్పించడం తో పాటు గా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టాని కి కూడా దోహదం చేస్తాయని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  అంతేకాకుండా ఈ ప్రాజెక్టు లు రాష్ట్రం లో పర్యటన రంగాని కి సరిక్రొత్త శక్తి ని కూడా ప్రసాదిస్తాయని ఆయన అన్నారు.

 

 

వైద్య విద్య లోను, ఇంజినీరింగ్ విద్య లోను రాజస్థాన్ కు ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెస్తూ, కోటా యొక్క తోడ్పాటు ను గురించి ప్రస్తావించారు;  విద్య కు తోడు వైద్యం మరియు ఇంజినీరింగ్ ల నిలయం గా రాజస్థాన్ మారింది అన్నారు.  ఎఐఐఎమ్ఎస్, జోధ్ పుర్ లో ట్రామా, ఇమర్ జన్సి ఎండ్ క్రిటికల్ కేయర్  సంబంధి సదుపాయాల ను అభివృద్ధి పరచడం జరుగుతుంది.  మరి రాజస్థాన్ నలుమూల ల  ప్రధాన మంత్రి- ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ (పిఎమ్- ఎబిహెచ్ఐఎమ్)  లో భాగం గా 7 క్రిటికల్ కేయర్ బ్లాకుల ను  సిద్ధం చేయడం జరుగుతోంది అని ఆయన అన్నారు.  ‘‘దేశం లో అగ్రగామి సంస్థ ల సరసన ఎఐఐఎమ్ఎస్, జోధ్ పుర్ మరియు ఐఐటి, జోధ్ పుర్ లు నిలవడం చూసి నేను సంతోషిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.  ‘‘ఎఐఐఎమ్ఎస్  మరియు ఐఐటి, జోధ్ పుర్ లు వైద్య సంబంధి సాంకేతిక విజ్ఞానం రంగం లో క్రొత్త అవకాశాల విషయం లో శ్రమించడం మొదలు పెట్టాయి.  రోబోల సాయం తో చేసే శస్త్ర చికిత్స లు వంటి హై-టెక్ మెడికల్ టెక్నాలజీ భారతదేశాని కి పరిశోధన మరియు పరిశ్రమ ల రంగం లో క్రొత్త శిఖరాల ను అందించనుంది.  ఇది వైద్య ప్రధానమైన పర్యటన లకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది.’’ అని ఆయన అన్నారు.

 

‘‘ప్రకృతి ని మరియు పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తుల కు నిలయం గా రాజస్థాన్ ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.  గురు శ్రీ జంబేశ్వర్  కి, ఇంకా శ్రీ బిష్ణోయీ కి చెందిన సముదాయాలు ఇక్కడ శతాబ్దాల తరబడి మనుగడ సాగించాయి అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు.  ఈ వారసత్వాన్ని ఆధారం గా చేసుకొని భారతదేశం ప్రస్తుతం యావత్తు ప్రపంచాని కి మార్గదర్శకత్వం వహిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు.  భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి ఒక దేశం గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ప్రయాసల పట్ల ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, రాజస్థాన్ అభివృద్ధి తోనే భారతదేశం యొక్క అభివృద్ధి ముడిపడి ఉంది అన్నారు.  ‘‘మనం అందరం కలిసికట్టు గా రాజస్థాన్ ను అభివృద్ధి పరచి, సమృద్ధం గా తీర్చిదిద్దాలి’’ అని చెప్తూ, శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. 

 

 

ఈ సందర్భం లో రాజస్థాన్ గవర్నరు శ్రీ కల్ రాజ్ మిశ్ర, కేంద్ర మంత్రులు శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, శ్రీ కైలాస్ చౌధరి లు సహా ఇతరులు పాలుపంచుకొన్నారు.

 

 

పూర్వరంగం

 

రాజస్థాన్ లో ఆరోగ్య రంగ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ను బలపరచడం కోసం ముఖ్య ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.  అఖిల భారత వైద్య సేవ ల సంస్థ (ఎఐఐఎమ్ఎస్), జోధ్ పుర్ లో 350 పడకల తో ఏర్పాటు కానున్న ట్రామా సెంటర్ ఎండ్ క్రిటికల్ కేయర్ హాస్పిటల్ బ్లాకు మరియు ప్రధాన మంత్రి - ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ (పిఎమ్-ఎబిహెచ్ఐఎమ్) లో భాగం గా రాజస్థాన్ లోని వివిధ ప్రాంతాల లో అభివృద్ధి పరచనున్న 7 క్రిటికల్ కేయర్ బ్లాకు లు ఆ ప్రాజెక్టుల లో భాగం గా ఉంటాయి.  ఎఐఐఎమ్ఎస్, జోధ్ పుర్ లో ట్రామా, ఇమర్ జన్సి ఎండ్ క్రిటికల్ కేయర్ ల కోసం ఉద్దేశించిన ఏకీకృత కేంద్రాన్ని 350 కోట్ల రూపాయల కు పైచిలుకు వ్యయం తో అభివృద్ధి పరచడం జరుగుతుంది.  ఈ కేంద్రం ట్రాయెజ్, రోగ నిర్ణయకారి, డే కేయర్, వార్డు లు, ప్రైవేట్ రూము లు, మాడ్యూలర్ ఆపరేటింగ్ థియేటర్ లు, ఐసియు లు, ఇంకా రక్తశుద్ధి కేంద్రం వంటి వివిధ సదుపాయాల తో కూడి ఉంటుంది.  ఇది వ్యాధిగ్రస్తుల కు విభిన్న విభాగాల లో విస్తృతమైన సంరక్షణ ను అందించి గాయాలు మరియు అత్యవసర స్థితుల నిర్వహణ పరం గా ఒక సమగ్రమైన దార్శనికత ను అందిస్తుంది.  యావత్తు రాజస్థాన్ లో ఏర్పాటు చేసే 7 క్రిటికల్ కేయర్ బ్లాకు లు రాష్ట్ర ప్రజల కు జిల్లా స్థాయి లో క్రిటికల్ కేయర్ సంబంధి మౌలిక సదుపాయాల ప్రయోజనాన్ని పెంపు చేయగలవు.

 

ప్రధాన మంత్రి జోధ్ పుర్ విమానాశ్రయం లో అత్యంత ఆధునికమైనటువంటి క్రొత్త టర్మినల్ బిల్డింగు కు కూడా శంకుస్థాపన చేశారు.  మొత్తం 480 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం జరుపుకొనే క్రొత్త టర్మినల్ బిల్డింగు సుమారు 24,000 చదరపు మీటర్ ల క్షేత్రం లో రూపుదిద్దుకొంటుంది;  రద్దీ కాలం లో 2,500 మంది ప్రయాణికుల కు సేవల ను అందించగలిగే విధం గా దీనిని తీర్చిదిద్దడం జరుగుతుంది.  ఇక్కడ ఏడాది లో 35 లక్షల మంది ప్రయాణికుల కు సేవల ను అందించవచ్చును. దీనితో కనెక్టివిటీ మెరుగు పడుతుంది; అలాగే ఆ ప్రాంతం లో పర్యటన  కు కూడా ప్రోత్సాహం లభిస్తుంది.

 

 

ఐఐటి జోధ్ పుర్ కేంపస్ ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు.  ఈ కేంపసు ను 1135 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో అత్యధునాతన సౌకర్యాల తో నిర్మించడం జరిగింది.  ఆధునిక పరిశోధన, నూతన ఆవిష్కరణ ల పరంగా ఉన్నతమైన నాణ్యత తో కూడిన సమగ్రమైన విద్య ను అందించడం తో పాటు మౌలిక సదుపాయాల ను సమకూర్చే దిశ లో ఇది ఒక మహత్వపూర్ణమైనటువంటి చర్య అని చెప్పాలి.

 

 

రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ లక్ష్యం తో ఏర్పాటైన సెంట్రల్ ఇన్ స్ట్రుమెంటేశన్ లబారటరి, సిబ్బంది కి నివాస సముదాయాలు మరియు యోగ, ఇంకా స్పోర్ట్ స్ బిల్డింగ్ లను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు.  రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో కేంద్రీయ గ్రంథాలయాని కి, 600 మంది విద్యార్థుల కు ఆశ్రయాన్ని ఇవ్వగలిగే వసతి గృహాని కి మరియు ఒక భోజనశాల కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

 

రాజస్థాన్  లో రహదారుల మౌలిక స్వరూపం లో మెరుగుదలను తీసుకువచ్చే ఉద్దేశ్యం తో ప్రధాన మంత్రి ఎన్ హెచ్-125ఎ లో జోధ్ పుర్ రింగ్ రోడ్ లో కార్ వాడ్ నుండి డాంగియావాస్ సెక్శన్ ను నాలుగు దోవ లు కలిగి ఉండేది గా మలచడం సహా అనేక రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల కు  శంకుస్థాపన చేశారు.  వీటి లో జాలోర్ (ఎన్ హెచ్-325) లోని బాలోత్ రా నుండి సాండేరావ్ సెక్శన్ వరకు ప్రముఖ పట్టణ ప్రాంతాల ను కలపడం కోసం ఏడు బైపాస్ లు/రీ-అలైన్ మెంట్ లను నిర్మించే పని, ఎన్ హెచ్-25 లో పచ్ పద్ రా -బాగూండీ సెక్శన్ లో నాలుగు దోవల తో కూడిన రహదారి ప్రాజెక్టు లు భాగం గా ఉన్నాయి.  ఈ రహదారి ప్రాజెక్టుల ను సుమారు 1475 కోట్ల రూపాయల మొత్తం ఖర్చు తో నిర్మించడం జరుగుతుంది.  జోధ్ పుర్ రింగ్ రోడ్ నిర్మాణం ద్వారా నగరం లో రాక పోకల లో ఎదురవుతున్న ఒత్తిడి ని తగ్గించడం తో పాటు వాహనాల వల్ల తలెత్తుతున్న కాలుష్యాన్ని తగ్గించడం వీలుపడుతుంది.  ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో కనెక్టివిటీ ని మెరుగు పరచడం తో పాటు వ్యాపారాన్ని ప్రోత్సహిస్తాయి.  ఉద్యోగ అవకాశాలు ను కల్పిస్తాయి. అంతేకాక  ఆర్థిక వృద్ధి లోనూ తోడ్పడుతాయి.

 

రాజస్థాన్ లో రెండు క్రొత్త రైలు సర్వీసుల కు ప్రధాన మంత్రి ప్రారంభ సూచకంగా ఆకుపచ్చటి జెండా ను చూపారు.  ఈ రైళ్ళ లో  జైసల్ మేర్ ను దిల్లీ తో కలిపే ఒక రైలు ‘రుణిచా ఎక్స్ ప్రెస్’, మార్ వాడ్ జంక్శన్ ను ఖాంబ్ లీ ఘాట్ తో కలిపే ఒక న్యూ హెరిటేజ్ ట్రేన్ లు ఉన్నాయి.  రుణిచా ఎక్స్ ప్రెస్ రైలు జోధ్ పుర్,  డెగానా, కుచామన్ సిటీ,  ఫులేరా, రీంగస్, శ్రీమాధోపుర్, నీమ్ కా థానా, నార్ నౌల్, అటేలీ, రేవాడీ ల మీదుగా ప్రయాణిస్తూ పోతుంది. ఫలితం గా జాతీయ రాజధాని నగరం నుండి అన్ని పట్టణాల కు సంధానం మెరుగు పడనుంది.  మార్ వాడ్ జంక్శన్ - ఖాంబ్ లీ లను కలిపే న్యూ హెరిటేజ్ ట్రేన్ ఆ ప్రాంతం లో పర్యటన కు ప్రోత్సాహాన్ని అందించడం తో పాటు ఉద్యోగ అవకాశాల ను కల్పిస్తుంది.  వీటికి అదనం గా, రెండు ఇతర రైలు ప్రాజెక్టుల ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి  అంకితం చేశారు.  వీటి లో 145 కిలో మీటర్ ల పొడవైన డెగానా - రాయ్ కా బాగ్ రైలు మార్గం మరియు 58 కి.మీ. పొడవైన డెగానా-కుచామన్ సిటీ  రైలు మార్గం యొక్క డబ్లింగ్ పనులు భాగం గా ఉన్నాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi