భారతీయ బొమ్మల తయారీ ని, ఇంకా ప్రపంచం లో భారతీయ బొమ్మ ల తాలూకు ముద్ర ను ప్రోత్సహించే మార్గాల ను గురించి చర్చించడం కోసం సీనియర్ మంత్రులు మరియు అధికారుల తో ఒక సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నిర్వహించారు.
భారతదేశం అనేక ఆటవస్తువుల క్లస్టర్ ల కు మరియు వేలాది హస్తకళాకారుల కు నిలయం గా ఉంది, ఆ కళాకారులు దేశవాళీ ఆటవస్తువుల ను తయారు చేస్తారు, ఆ దేశవాళీ ఆటవస్తువుల కు సంస్కృతి తో సంబంధం ఉండటం ఒక్కటే కాకుండా, బాల ల్లో లేత ప్రాయం లోనే మానసిక చలన సంబంధి నైపుణ్యాల కు, ఇంకా జీవన ప్రావీణ్యాల కు పోత పోయడం లో ఆ దేశవాళీ ఆటవస్తువులు సహాయకారి గా కూడా ఉంటాయని ప్రధాన మంత్రి అన్నారు. ఆ తరహా సమూహాల ను సృజనాత్మకమైన పద్ధతుల ద్వారా, నూతన ఆవిష్కరణయుత పద్ధతుల ద్వారా ప్రోత్సహించి తీరాలి అని ఆయన చెప్పారు.
భారతీయ ఆటవస్తువుల బజారు కు భారీ సామర్థ్యం ఉందన్నది తెలిసిందేనని, ఆత్మనిర్భర్ భారత్ ప్రచార ఉద్యమం లో భాగం గా ‘వోకల్ ఫార్ లోకల్’ ను ప్రోత్సహించడం ద్వారా ఈ పరిశ్రమ లో ఒక పరివర్తనాత్మకమైన మార్పు ను భారతీయ బొమ్మల విపణి తీసుకొని రాగలదని సూచించడం జరిగింది. సాంకేతిక విజ్ఞానాన్ని, ఇంకా నూతన ఆవిష్కరణ ను ఉపయోగించడం పైన, నాణ్యమైన ఉత్పత్తుల తో పాటు ప్రపంచ ప్రమాణాల కు తుల తూగే ఉత్పత్తుల ను కూడా తయారు చేయడం పైన శ్రద్ధ వహించాలని ప్రధాన మంత్రి అన్నారు.
బాలల మానసికచలన నైపుణ్యాలు / సజాతీయ ప్రావీణ్యాల పై ఆటవస్తువుల ప్రభావం, ఇంకా అవి సామాజిక పరివర్తన కు ఒక సాధనం గా ఎలా రూపొందగలవో తద్ద్వారా దేశం లోని భావితరానికి ఒక రూపు ను ఇవ్వడం లో సాయపడతాయో అనే అంశాల ను గురించి కూడా సమావేశం లో చర్చించడమైంది.
బాలల మస్తిష్కాన్ని మలచడం లో ఆటవస్తువుల ప్రాధాన్యాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, భారతీయ సంస్కృతి తోను, భారతీయ సభ్యత తోను మమేకమైన బొమ్మల ను బాలల యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం అన్ని ఆంగన్ వాడీ కేంద్రాల లో మరియు పాఠశాలల్లో శిక్షణ కు సాధనాలు గా ఉపయోగించాలని ప్రధాన మంత్రి అన్నారు. దేశ లక్ష్యాలు, దేశం యొక్క కార్యసాధనల దిశ గా ఒక అతిశయ భావన ను పాదుకొల్పగల బొమ్మల ను, ఇంకా నూతనమైన రూపురేఖలను ముందుకు తీసుకువచ్చే పని లో యువత తలమునకలు కావాలి అని కూడా ఆయన సలహా ఇచ్చారు.
ఆటవస్తువులు ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన ను ఉత్తేజితం చేయడం లో ఓ ఉత్తమమైన మాధ్యమం కాగలవు అని ప్రధాన మంత్రి అన్నారు. ఆటబొమ్మలనేవి భారతదేశ విలువల వ్యవస్థ కు , ఇంకా భారతదేశం లో సంస్కృతి పరం గా సువ్యవస్థితమైన పర్యావరణస్నేహశీలత్వాని కి అద్దం పట్టాలి అని ఆయన ఉద్ఘాటించారు. భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల ను ప్రోత్సహించడం కోసం- ప్రత్యేకించి హస్తకళా ఆటవస్తువుల కు పేరెన్నిక గన్న ప్రాంతాల లో- భారతదేశ సంస్కృతి సంప్రదాయాల ను ప్రోత్సహించడం కోసం పర్యటన రంగాన్ని ఒక పనిముట్టు గా ఉపయోగించవలసిందని కూడా ఆయన సూచన చేశారు.
ఆన్ లైన్ గేమ్స్ సహా ఆటవస్తువుల కు సంబంధించిన సాంకేతిక విజ్ఞానం లోను, ఆకృతి లోను నూతన ఆవిష్కరణల కోసం విద్యార్థుల లో, యువతీయువకుల లో హ్యాకథన్ ల ను నిర్వహించవలసిన అవసరం ఉందని కూడా ప్రధాన మంత్రి నొక్కిపలికారు.
శరవేగం గా ఎదుగుతున్న గేమింగ్ రంగాన్ని గురించి ప్రధాన మంత్రి ఉద్ఘాటిస్తూ, ఈ రంగం లో గల భారీ అవకాశాల ను భారతదేశం వినియోగించుకోవాలని, అలాగే భారతీయ సంస్కృతి నుండి మరియు భారతీయ జానపద కథల నుండి ప్రేరణ ను పొందిన ఆటల కు రూపకల్పన చేయడం ద్వారా అంతర్జాతీయ డిజిటల్ గేమింగ్ రంగం లో భారతదేశం నాయకత్వం వహించాలన్నారు.