యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్ డెర్ లేయేన్ తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను ఈ రోజు అభినందించారు.
భారతదేశం, యూరోపియన్ యూనియన్ ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృఢతరం చేసేందుకు కలసి పని చేయాలని తాను ఎదురు చూస్తున్నానని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలుగా తిరిగి ఎన్నికైన సందర్భంగా @vonderleyen , మీకు అభినందనలు. ప్రపంచ హితం దృష్ట్యా భారతదేశం - యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరచడానికి మీతో కలసి పని చేయాలని నేను ఎదురుచూస్తున్నాను.’’
Congratulations, @vonderleyen, on your re-election as the President of the European Commission. Look forward to working together to strengthen the 🇮🇳-🇪🇺 Strategic Partnership for global good.
— Narendra Modi (@narendramodi) July 19, 2024