సీరమ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ ల టీకామందుల కు డిసిజిఐ ఆమోదం లభించడం కరోనా తో స్ఫూర్తిదాయక పోరు ను బలపర్చడం లో ఒక విప్లవాత్మక మార్పును సూచిస్తోంది అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు.
ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పోరు ను బలపర్చడం లో ఓ క్రాంతికారి పరివర్తన కు సూచిక గా ఉంది.
@SerumInstIndia మరియు @BharatBiotech ల టీకామందుల కు డిసిజిఐ ఆమోదముద్ర వేయడం ఆరోగ్యకరమైనటువంటి దేశాన్ని, కోవిడ్ కు తావు ఉండనటువంటి దేశాన్ని ఆవిష్కరించే ప్రక్రియ ను వేగవంతం చేస్తుంది.
భారతదేశానికి అభినందన లు.
కఠోరంగా శ్రమించే మన శాస్త్రవేత్తల కు, నూతన ఆవిష్కర్తతల కు ఇవే అభినందనలు’’ అని ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో పేర్కొన్నారు.
— Narendra Modi (@narendramodi) January 3, 2021
‘‘అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన రెండు వ్యాక్సీన్ లు భారతదేశం లో తయారు కావడం భారతదేశం లో ప్రతి ఒక్కరు కూడా గర్వపడేటట్టు చేస్తుంది.
ఇది సంరక్షణ, కరుణ లు పునాది గా ఉండేటటువంటి ఒక ‘ఆత్మనిర్భర్ భారత్’ కల ను నెరవేర్చడానికి మన శాస్త్రవేత్తలు తహతహలాడుతూ ఉండటాన్ని చాటిచెప్తున్నది.’’
— Narendra Modi (@narendramodi) January 3, 2021
‘‘మనం ప్రతికూల పరిస్థితులలో విశిష్ట శ్రమ చేసిన మన వైద్యులకు, వైద్య సిబ్బంది కి, శాస్త్రవేత్తల కు, పోలీసు ఉద్యోగుల కు, పారిశుధ్య కార్మికుల కు, కరోనా యోధుల కు మన కృతజ్ఞత ను పునరుద్ఘాటించుదాం.
అనేక ప్రాణాలను కాపాడినందుకుగాను వారికి మనం సదా కృతజ్ఞలమై ఉందాము. ’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
— Narendra Modi (@narendramodi) January 3, 2021