విజ్ఞానశాస్త్రం పట్ల విశేషమైనటువంటి విశ్వాసాన్ని చాటిచెప్పినందుకు మరియు 200 కోట్ల కోవిడ్-19 టీకామందు డోజుల ప్రత్యేక సంఖ్య ను దాటిపోయినందుకు భారతదేశం ప్రజానీకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. అలాగే, ఈ ఉద్యమం లో పాలుపంచుకొన్న వైద్యులు, నర్సు లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, శాస్త్రవేత్తలు, నూతన ఆవిష్కర్తలు మరియు నవపారిశ్రామిక వేత్తల ఉత్సాహాన్ని, వారి దృఢ సంకల్పాన్ని ఆయన మెచ్చుకొన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవియ చేసిన ఒక ప్రకటన కు సమాధానం గా ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భారతదేశం మరో సారి చరిత్ర ను సృష్టించింది. 200 కోట్ల వేక్సీన్ డోజుల విశిష్ట సంఖ్య ను దాటిపోయిన సందర్భం లో భారతీయులు అందరి కి ఇవే అభినందన లు. భారతదేశం యొక్క టీకాకరణ కార్యక్రమాన్ని స్థాయి లోన, వేగం లోన సాటిలేని విధం గా కొనసాగించడానికి తోడ్పాటు ను అందించిన వారిని చూస్తూ ఉంటే మనసు గర్వం తో ఉప్పొంగిపోతున్నది. కోవిడ్-19 కి వ్యతిరేకంగా ప్రపంచం సలుపుతున్న పోరాటాన్ని ఈ ఘట్టం బలోపేతం చేసివేసింది.
టీకామందు ను తీసుకొనే కార్యక్రమం కొనసాగుతున్నంత కాలం భారతదేశ ప్రజానీకం విజ్ఞానశాస్త్రం పట్ల విశేషమైనటువంటి విశ్వాసాన్ని చాటారు. భూ గ్రహాన్ని భద్రమైందిగా ఉంచడం కోసం పూచీ పడటం లో మన వైద్యులు, నర్సు లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, శాస్త్రజ్ఞులు, నూతన ఆవిష్కర్తల తో పాటు నవ పారిశ్రామిక వేత్త లు ఒక ముఖ్య పాత్ర ను పోషించారు. వారి ఉత్సాహాన్ని మరియు వారి యొక్క దృఢ సంకల్పాన్ని నేను ప్రశంసిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
India creates history again! Congrats to all Indians on crossing the special figure of 200 crore vaccine doses. Proud of those who contributed to making India’s vaccination drive unparalleled in scale and speed. This has strengthened the global fight against COVID-19. https://t.co/K5wc1U6oVM
— Narendra Modi (@narendramodi) July 17, 2022