చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల జావెలెన్ త్రో ఎఫ్-55 విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న టేక్‌చంద్ మహ్లావత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. మహ్లావత్ ప్రతిభను కొనియాడుతూ- ఈ విజయం సంకల్ప బలానికి, శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని, తద్వారా అతడు దేశం గర్వించే విజయం సాధించాడని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-55 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి కాంస్యం సాధించిన టేక్‌చంద్ మహ్లావత్‌కు నా అభినందనలు. అతని సంకల్పం బలం, నైపుణ్యం, శక్తిసామర్థ్యాలను ఈ విజయం ప్రతిబింబించింది. అలాగే ఇది మన దేశానికి ఎంతో గర్వకారణం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Huge congratulations to @MahlawatTek for his outstanding Bronze medal win in Men's Javelin Throw-F55.
— Narendra Modi (@narendramodi) October 28, 2023
The performance showcases determination and excellence, and it brings immense pride to our nation. pic.twitter.com/xttQAUxNzk