ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘జావెలిన్ త్రో ఎఫ్-46’లో స్వర్ణ పతకం సాధించిన సుందర్ సింగ్ గుర్జర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. గుర్జర్ అపూర్వ ప్రతిభను ఆయన ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ జావెలిన్ త్రో ఎఫ్-46లో అద్భుత నైపుణ్యంతో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సుందర్ సింగ్ గుర్జర్ @SundarSGurjarకు అభినందనలు. ఇదెంతో అపురూప విజయం. ఆయన ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
A tremendous achievement by Ajeet Singh as he secured the Bronze Medal in the Javelin Throw F46 event. This success is a result of his hard work and dedication. Best wishes for his upcoming endeavours. pic.twitter.com/qFEgLl45n9
— Narendra Modi (@narendramodi) October 25, 2023