బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్-2022 పారా టెబుల్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారిణి సోనాల్ పటేల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో;
“ప్రతిభ, దీక్ష, పట్టుదల కలగలిస్తే అసాధ్యమన్నది లేనేలేదు. ఆమె ఈ మూడు లక్షణాలనూ సంపూర్ణ స్థాయిలో ప్రదర్శించడం వల్లనే పారా టేబుల్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించారు. ఆమెకు నా అభినందనలు. భవిష్యత్తులోనూ ఆమె తన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో నిరూపించుకోవాలని ఆకాంక్షిస్తూ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #Cheer4India” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
When talent, temperament and tenacity combine, nothing is impossible. Sonal Patel has shown this in letter and spirit by winning a Bronze medal in Para Table Tennis. Congratulations to her. I pray that she continues to distinguish herself in the coming times. #Cheer4India pic.twitter.com/OuvspIw4LF
— Narendra Modi (@narendramodi) August 7, 2022