రాజస్థాన్ కు ముఖ్యమంత్రి గా శ్రీ భజన్ లాల్ శర్మ పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలిపారు. ఆ రాష్ట్రాని కి ఉప ముఖ్యమంత్రులు గా శ్రీమతి దీయా కుమారి మరియు శ్రీ ప్రేమ్ చంద్ భైర్‌వా లు పదవీ ప్రమాణాన్ని స్వీకరించగా, వారి కి కూడా ప్రధాన మంత్రి అభినందనలను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘రాజస్థాన్ కు ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన శ్రీ భజన్ లాల్ శర్మ కు, ఉప ముఖ్యమంత్రులు దీయా కుమారి గారి కి మరియు ప్రేమ్ చంద్ భైర్‌వా గారి కి అనేకానేక అభినందన లు. వీరులు మరియు వీరాంగనల గడ్డ అయినటువంటి ఈ రాష్ట్రం మీ యొక్క నాయకత్వం లో సుపరిపాలన, సమృద్ధి మరియు అభివృద్ధి తాలూకు సరిక్రొత్త ప్రమాణాల ను ప్రతి నిత్యం ప్రతిష్ఠిస్తుందన్న నమ్మకం నాలో ఉంది. ఇక్కడి నా కుటుంబ సభ్యులు ఏ విధమైనటువంటి భరోసా తో మరియు అంచనా తో మాకు పరిపూర్ణ ఆశీర్వాదాల ను ఇచ్చారో, వాటిని నిలబెట్టుకోవడం లో బిజెపి ప్రభుత్వం మన: పూర్వకం గా నిమగ్నం అవుతుంది.’’ అని పేర్కొన్నారు.
राजस्थान के मुख्यमंत्री के रूप में शपथ लेने वाले भजन लाल शर्मा जी के साथ ही उप मुख्यमंत्री दीया कुमारी जी और प्रेमचंद बैरवा जी को बहुत-बहुत बधाई! मुझे विश्वास है कि वीर-वीरांगनाओं का यह प्रदेश आपके नेतृत्व में सुशासन, समृद्धि और विकास के नित-नए मानदंड स्थापित करेगा। यहां के मेरे… pic.twitter.com/szZ0Ezz5Vy
— Narendra Modi (@narendramodi) December 15, 2023