బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబుల్ టెనిస్ పురుషుల సింగిల్స్ విభాగం లో పసిడి పతకాన్ని గెలిచినందుకు శ్రీ శరత్ కమల్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ @sharathkamal1 సాధించిన స్వర్ణ పతకం చరిత్ర లో ఓ చాలా విశేషమైనటువంటి పతకం గా నమోదు అవుతుంది. ఆయన అంతులేని ఓర్పు, దృఢసంకల్పం మరియు ఆటుపోటుల కు తట్టుకొని నిలచే స్వభావాల తాలూకు శక్తి ని పరిచయం చేశారు. ఆయన గొప్ప నైపుణ్యాలను కూడా చాటారు. ఈ పతకం భారతదేశం లో టేబుల్ టెనిస్ క్రీడ కు ఎక్కడలేనటువంటి ఉత్సాహవర్ధకం గా నిలుస్తుంది. ఆయన కు ఇవే అభినందనలూ, శుభాకాంక్షలూ ను. #Cheer4India.’’ అని పేర్కొన్నారు.
Gold medal by @sharathkamal1 will be recorded in history as a very special one. He has shown the power of patience, determination and resilience. He also demonstrated great skills. This medal is a big boost for Indian Table Tennis. Congrats and best wishes to him. #Cheer4India. pic.twitter.com/kdwBjfKSvC
— Narendra Modi (@narendramodi) August 8, 2022