ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో స్వర్ణం సాధించిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టీలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టీ @satwiksairaj and @Shettychirag04 మెరుపు వేగంతో ఈ ద్వయం బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న తీరుకు అందర్నీ ముగ్ధులను చేసింది. వారికి నా అభినందనలు. వారి క్రీడా ప్రతిభ కోర్టులో మెరుపులు మెరిపిస్తుంది. భారతదేశాన్ని సదా గర్వించేలా చేస్తుంది!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
The electrifying duo of @satwiksairaj and @Shettychirag04 have won a Gold Medal in Badminton Men's Doubles. Congrats to them. Their game lights up the court and makes India proud always! pic.twitter.com/XBpdEWJp9X
— Narendra Modi (@narendramodi) October 7, 2023