స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఐఎల్-సెయిల్) లిమిటెడ్ 2022-23లో హాట్ మెటల్, ముడి ఉక్కు ఉత్పాదనలో కొత్త రికార్డు సృష్టించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు 194.09 లక్షల టన్నుల హాట్ మెటల్ (3.5 శాతం అధికం), 182.89 లక్షల టన్నుల ముడి ఉక్కు (5.3 శాతం అధికం) ఉత్పాదన ద్వారా మునుపటి రికార్డును అధిగమించింది.
దీనిపై ప్రధానమంత్రి స్పందిస్తూ- భారతదేశం ప్రతి రంగంలోనూ స్వయం సమృద్ధం అవుతున్నదని చెప్పడానికి ఇదే నిదర్శనమని అభినందించారు. ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇంతటి విజయం సాధించినందుకు ఎనలేని అభినందనలు! ‘సెయిల్’ సాధించిన ఈ రికార్డు స్థాయి ఉత్పాదన ఒక్క ఉక్కు రంగంలోనే కాకుండా ప్రతి రంగంలోనూ దేశం స్వావలంబన దిశగా శరవేగంతో పయనిస్తోందని స్పష్టం చేస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.
इस शानदार उपलब्धि के लिए बहुत बधाई! SAIL का यह उत्पादन बताता है कि स्टील ही नहीं, बल्कि हर क्षेत्र में देश आत्मनिर्भरता की ओर तेजी से कदम बढ़ा रहा हैं। https://t.co/sViusASjss
— Narendra Modi (@narendramodi) April 2, 2023