గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో వరుసగా రెండో సారి “A+” (ఎ ప్లస్) రేటింగును పొందిన భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.
భారతీయ రిజర్వు బ్యాంకు ‘ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశానికి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ:
“ఆర్బీఐ గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ (@DasShaktikanta) ఈ అసాధారణ కార్యాన్ని సాధించినందుకు, అదీనూ ఏకంగా రెండో సారి సాధించినందుకుగాను ఆయనకు అభినందనలు. ఇది ఆర్బీఐకి ఆయన వహిస్తున్న నాయకత్వానికే కాకుండా ఆర్థికవృద్ధికీ, స్థిరత్వానికీ లభించిన గుర్తింపు” అని పేర్కొన్నారు.
Congratulations to RBI Governor Shri @DasShaktikanta for this feat, and that too for the second time. This is a recognition of his leadership at the RBI and his work towards ensuring economic growth and stability. https://t.co/lzfogAQb15
— Narendra Modi (@narendramodi) August 21, 2024