ఆసియా క్రీడల పురుషుల హాకీలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భారత క్రీడాకారులు చూపిన పట్టుదల, అంకిత భావం, మైదానంలో వారి మధ్య సమన్వయం అత్యద్భుతమని ఆయన కొనియాడారు. భవిష్యత్తులోనూ వారు మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడాల్లో మన పురుషుల హాకీ జట్టు అత్యద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం చేజిక్కించుకుంది! ఈ అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శనపై జట్టుకు నా అభినందనలు. అకుంఠిత దీక్ష, అంకిత భావం, ఆటగాళ్ల మధ్య సమన్వయం ఎంతో అబ్బురపరిచాయి. తమ నైపుణ్యంతో వారు పతకాన్ని మాత్రమే కాకుండా అసంఖ్యాక భారతీయుల హృదయాలను కూడా గెలుచుకున్నారు. వారి జట్టు స్ఫూర్తికి ఈ విజయం ఒక నిదర్శనం. భవిష్యత్తులోనూ వారు ఇలాగా అత్యుత్తమంగా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
An exhilarating Gold Medal triumph by our Men's Hockey Team at the Asian Games! Congratulations to the team for this outstanding performance. This team's unwavering commitment, passion and synergy have not only won the game but also the hearts of countless Indians. This victory… pic.twitter.com/WFX6sbMzKc
— Narendra Modi (@narendramodi) October 6, 2023