‘పారిస్ ఒలింపిక్స్ 2024’లో పది మీటర్ ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ పోటీ లో కాంస్య పతకాన్ని సాధించిన భారతీయ షూటర్ లు మను భాకర్, సరబ్ జోత్ సింగ్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘మన షూటర్లను చూసుకొని మనం గర్వపడేటట్టు చేస్తూ, వారు నిరంతరంగా రాణిస్తూ వస్తున్నారు.
#Olympics లో పది మీటర్ ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు @realmanubhaker, సరబ్ జోత్ సింగ్ లకు అభినందనలు. వారు ఇద్దరూ గొప్ప నైపుణ్యాన్ని, సంఘటిత కృషిని చాటారు. భారతదేశం పట్టరానంత సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతోంది.
మను కు ఇది ఆమె వరుసగా సాధించిన రెండో ఒలింపిక్ పతకం; ఈ పతకం ఆమె శ్రేష్ఠత్వాన్ని, అంకిత భావాన్ని రుజువుచేస్తోంది. #Cheer4Bharat’’
Our shooters continue to make us proud!
— Narendra Modi (@narendramodi) July 30, 2024
Congratulations to @realmanubhaker and Sarabjot Singh for winning the Bronze medal in the 10m Air Pistol Mixed Team event at the #Olympics. Both of them have shown great skills and teamwork. India is incredibly delighted.
For Manu, this… pic.twitter.com/loUsQjnLbN