ఆసియా పారాగేమ్స్ మహిళల 'బ్యాడ్మింటన్ డబుల్స్ ఎస్ఎల్-3.. ఎస్‌యు-5'లో కాంస్య పతకం సాధించిన మనీషా రామదాస్, మన్‌దీప్ కౌర్ల జోడీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఆటలో వారిద్దరి మధ్య అద్భుత సమన్వయం, పట్టుదల ఈ విజయానికి దోహదం చేశాయని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారాగేమ్స్ మహిళల 'బ్యాడ్మింటన్ డబుల్స్ ఎస్ఎల్-3.. ఎస్‌యు-5'లో మనీషా రామదాస్, మన్‌దీప్ కౌర్ల జంట కాంస్య పతకం సాధించినందుకు అభినందనలు. వారిద్దరి మధ్య సమన్వయం, ఆటలో వారు చూపిన పట్టుదల అద్భుతం” అని ప్రధానమంత్రి ప్రశంసించారు.
Kudos to Manisha Ramadass and Mandeep Kaur for clinching the Bronze Medal in the Women's Doubles Badminton SL3-SU5 event.
— Narendra Modi (@narendramodi) October 26, 2023
They have showcased exemplary coordination and determination. pic.twitter.com/vPjeosAyyj