హాంగ్ ఝూ ఆసియన్ పారా గేమ్స్ లో మహిళల డబుల్స్ SL3-SU5 ఈవెంట్ లో రజత పతకం గెలుచుకున్న మానసి నయన జోషి, తులసీమతి మురుగేశన్ లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు అందచేశారు.
వారి టీమ్ వర్స్ ను ఆయన కొనియాడారు.
ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్ చేశారు.
‘‘మహిళల డబుల్స్ SL3-SU5 ఈవెంట్ లో అద్భుత రజత పతకం గెలుచుకున్న @joshimanasi11 and @Thulasimathi11 లకు అభినందనలు. వారు అద్భుతమైన టీమ్ వర్క్, అంకిత భావం ప్రదర్శించారు’’ అని పేర్కొన్నారు.
Congratulations to @joshimanasi11 and @Thulasimathi11 for their splendid Silver win in Women's Doubles SL3-SU5 event. Great teamwork and dedication by them! pic.twitter.com/yBxLd8Fpz6
— Narendra Modi (@narendramodi) October 27, 2023