బ్రెజిల్ అధ్యక్షుని గా శ్రీ లుయిజ్ ఇనాసియో లూలా డీ సిల్వా పదవీ బాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలిపారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘బ్రెజిల్ అధ్యక్ష పదవీ బాధ్యతల ను శ్రీ లుయిజ్ ఇనాసియో లూలా డీ సిల్వా స్వీకరించిన సందర్భం లో ఆయన కు ఇవే హృదయ పూర్వక అభినందన లు. ఆయన మూడో పదవీ కాలం సఫలం అవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను; మరి భారతదేశం - బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరచడం కోసం ఆయన తో కలసి పని చేయాలని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
Hearty congratulations to @LulaOficial on assuming office as the President of Brazil. I wish him a successful third term and look forward to working with him to strengthen India - Brazil Strategic Partnership.
— Narendra Modi (@narendramodi) January 2, 2023