బ్రెజిల్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు శ్రీ లుయిజ్ ఇనాసియో డీ సిల్వా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘బ్రెజిల్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందుకు @LulaOficial కు ఇవే అభినందన లు. మన ద్వైపాక్షిక సంబంధాల ను, అలాగే ప్రపంచ విషయాలలో మన సహకారాన్ని మరింత గా గాఢతరం చేసుకొనేందుకు మరియు విస్తృతపరచుకొనేందుకు ఉభయులం కలసి పనిచేయాలి అని నేను ఆశపడుతున్నాను: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.
Congratulations to @LulaOficial on winning the Presidential elections in Brazil. I look forward to working closely together to further deepen and widen our bilateral relations, as also our cooperation on global issues: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 31, 2022