శ్రీ లియో వరాడ్ కర్ యే రెండో సారి కూడాను తావోసీచ్ (ఐర్ లాండ్ యొక్క ప్రధాని) పదవి బాధ్యతల ను తాను స్వీకరించిన సందర్భం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘తావోసీచ్ గా రెండో సారి పదవి బాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో శ్రీ @LeoVaradkar , అందుకోండి నా అభినందన లు. ఐర్ లాండ్ తో మా చరిత్రాత్మకమైన సంబంధాలకు, ఉమ్మడి రాజ్యాంగ విలువల కు మరియు బహుముఖీనమైన సహకారానికి మేం చాలా ప్రాధాన్యాన్ని ఇస్తాం. మన చైతన్యవంతమైన ఆర్థిక వ్యవస్థల ను పూర్తి సామర్థ్యం తో ఉపయోగించుకోవడం కోసం నేను కలిసికట్టు గా కృషి చేయాలని ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
Congratulations @LeoVaradkar on assuming office as Taoiseach for the second time. Highly value our historical ties, shared constitutional values & multi-faceted cooperation with Ireland. Look forward to working together to realise the full potential of our vibrant economies.
— Narendra Modi (@narendramodi) December 17, 2022