పిఎస్ఎల్ వి-సి49/ఇఒఎస్-01 మిశన్ ను విజయవంతంగా ప్రయోగించినందుకు భారతీయ అంతరిక్ష పరిశ్రమను, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ ఆర్ ఒ.. ‘ఇస్రో’) ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘శనివారం పిఎస్ఎల్ వి-సి49/ఇఒఎస్-01 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించినందుకు భారతీయ అంతరిక్ష పరిశ్రమను, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ ఆర్ ఒ.. ‘ఇస్రో’) ను నేను అభినందిస్తున్నాను. నిర్దిష్ట చివరి గడువు లోపల ముఖ్యమైన పనులను పూర్తి చేయడం కోసం కోవిడ్-19 కాలంలో ఎదురైన ఎన్నో అడ్డంకులను మన శాస్త్రవేత్తలు అధిగమించారు.
ఈ మిషన్ లో భాగంగా యుఎస్, లక్జెంబర్గ్ ల కు చెందిన నాలుగేసి ఉపగ్రహాలు, లిథుయేనియా కు చెందిన ఒక ఉపగ్రహం సహా తొమ్మిది ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
Nine satellites, including four each from the US and Luxembourg and one from Lithuania, have also been launched in the Mission.
— Narendra Modi (@narendramodi) November 7, 2020
I congratulate @ISRO and India's space industry for the successful launch of PSLV-C49/EOS-01 Mission today. In the time of COVID-19, our scientists overcame many constraints to meet the deadline.
— Narendra Modi (@narendramodi) November 7, 2020