భారతదేశ స్టార్ట్ అప్స్ కు చెందిన రెండు పేలోడ్ లను పిఎస్ఎల్ వి సి53 యాత్ర ద్వారా రోదసి లోకి విజయవంతంగా ప్రవేశపెట్టినందుకు గాను ఇస్ రో కు మరియు ఇన్-స్పేస్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
భారతదేశ స్టార్ట్ అప్స్ కు చెందిన రెండు పేలోడ్ లను రోదసి లోకి ప్రవేశపెట్టడం ద్వారా పిఎస్ఎల్ వి సి53 యాత్ర ఒక సరికొత్త మైలురాయి ని చేరుకొన్నది. ఈ సాహస కార్యానికి గాను @isro కు మరియు @INSPACeIND కు అభినందన లు. సమీప భవిష్యత్తు లో మరిన్ని భారతదేశ కంపెనీ లు అంతరిక్షం లోకి చేరుకొంటాయన్న నమ్మకం ఉంది.’’ అని పేర్కొన్నారు.
The PSLV C53 mission has achieved a new milestone by launching two payloads of Indian Start-ups in Space. Congratulations @INSPACeIND and @isro for enabling this venture. Confident that many more indian companies will reach Space in near future.
— Narendra Modi (@narendramodi) July 1, 2022