చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ మహిళల ‘చదరంగం బి-1’ (జట్టు) విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న హిమాంశి రాఠీ, సంస్కృతి మోరే, వృతి జైన్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
"ఆసియా పారాగేమ్స్ మహిళల ‘చదరంగం బి-1‘ (జట్టు) విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్న హిమాంశి రాఠీ, సంస్కృతి మోరే, వృతి జైన్‌లకు నా హృదయపూర్వక అభినందనలు. వారి నైపుణ్యం, దృఢ సంకల్పం, నిరంతర పరిశ్రమ దేశం గర్వించే విజయాన్ని సాధించిపెట్టాయి’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Heartiest congratulations to Himanshi Rathi, Sanskruti More and Vruthi Jain for clinching the Bronze Medal in Women's Chess B1 Category Team at the Asian Para Games.
— Narendra Modi (@narendramodi) October 28, 2023
Their skill, determination and relentless spirit have made the nation proud. pic.twitter.com/yZVtu6MLv2