ఇస్లామిక్ గణతంత్రం ఇరాన్ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ మసూద్ పెజెశ్కియాన్ కు అభినందనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో -
‘‘శ్రీ @drpezeshkian , మీరు ఇస్లామిక్ గణతంత్రం ఇరాన్ కు అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా మీకు ఇవే అభినందనలు. మన దేశాల ప్రజల ప్రయోజనాల కోసం, ఈ ప్రాంతం ప్రయోజనాల కోసం మన స్నేహపూర్ణ సంబంధాలు, మన దీర్ఘకాలిక ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలపరచడం కోసం మీతో కలసి పనిచేయాలన్న ఆశ నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.
Congratulations @drpezeshkian on your election as the President of the Islamic Republic of Iran. Looking forward to working closely with you to further strengthen our warm and long-standing bilateral relationship for the benefit of our peoples and the region.
— Narendra Modi (@narendramodi) July 6, 2024