జిఇఎమ్ ఇండియా లో అగ్రగామి ప్రదర్శన ను కనబరచిన వారి కి వారి యొక్క ప్రశంసాయోగ్యమైనటువంటి తోడ్పాటుల కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.
జిఇఎమ్ ఇండియా లో అగ్రగామి ప్రదర్శన ను కనబరచిన వారి ని గుర్తించి, ‘క్రేత-విక్రేత గౌరవ్ సమ్మాన్ సమారోహ్ 2023’ లో బహుమతుల ను అందించడమైందని వాణిజ్యం మరియు పరిశ్రమ ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కొన్ని ట్వీట్ లలో పేర్కొన్నారు. ‘క్రేత-విక్రేత గౌరవ్ సమ్మాన్ సమారోహ్ 2023’ విజేత గా ఎమ్ఒహెచ్ఎఫ్ డబ్ల్యు నిలచింది. ఈ కార్యక్రమాన్ని వాణిజ్యం మరియు పరిశ్రమ ల మంత్రిత్వ శాఖ కు చెందిన గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ ద్వారా నిర్వహించడం జరిగింది.
శ్రీ పీయూష్ గోయల్ ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘@GeM_India's లో అగ్రగామి ప్రదర్శన ను కనబరచిన వారి కి వారి యొక్క ప్రశంసాయోగ్యమైనటువంటి తోడ్పాటుల కు గాను ఇవే అభినందన లు. ఈ తరహా ప్రయాస లు భారతదేశం జరుపుతున్నటువంటి సమృద్ధి మరియు ఆత్మనిర్భరత ల యాత్ర ను బలపరుస్తాయి.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Congratulations to @GeM_India's top performers for their remarkable contributions. Such efforts strengthen India's journey towards prosperity and self-reliance. https://t.co/jn4QlJOzzW
— Narendra Modi (@narendramodi) June 28, 2023