ఆసియా పారాగేమ్స్ పురుషుల ఆర్చరీలో రజత పతకం సాధించిన రాకేష్ కుమార్, సూరజ్ సింగ్ జోడీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రశంసించారు. చురుకైన ఈ జంట సాధించిన సమష్టి విజయం దేశం గర్వించేలా చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల ‘ఆర్చరీ కాంపౌండ్-ఓపెన్’లో రజత పతకం సొంతం చేసుకున్న రాకేష్ కుమార్, సూరజ్ సింగ్ జోడీకి నా అభినందనలు. వారు ప్రదర్శించిన సమష్టి ప్రతిభ, లక్ష్య ఛేదనలో కచ్చితత్వం మనల్నందర్నీ గర్వించేలా చేశాయి. వారికి నా శుభాసీస్సులు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Kudos to the dynamic duo, Rakesh Kumar and Suraj Singh, for clinching the Silver in Para Archery in Men's Doubles Compound - Open event. Their exceptional teamwork and precision have made India immensely proud. Best wishes to them. pic.twitter.com/Mly4C6gCsa
— Narendra Modi (@narendramodi) October 25, 2023