సిబిఎస్ఇ పరీక్షల లో కృతార్థులైన పన్నెండో తరగతి విద్యార్థుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు. వారి ని యువ మిత్రులు అంటూ ఆయన సంబోధించారు; వారికి ఒక ఉన్నతమైనటువంటి, సంతోషదాయకమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్తు లభించాలి అని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.

‘‘ XIIవ తరగతి సిబిఎస్ఇ పరీక్షల లో విజయవంతం గా ఉత్తీర్ణత ను సాధించిన నా యువ మిత్రుల కు అభినందనలు. వారికి ఒక ఉజ్వలమైన, సంతోషదాయకమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కై ఇవే శుభాకాంక్ష లు.

మరింత కఠోర కృషి ని చేసి ఉండవలసిందని గాని లేదా మరింత ఉత్తమమైనటువంటి ప్రదర్శన ను కనబరచి ఉండవలసిందని గాని భావించే వారికి నేను ఒకటి చెప్పదలచుకొన్నాను.. మీ అనుభవం లో నుంచి నేర్చుకోండి, మరి మీ శిరస్సు ను ఉన్నతం గా ఉంచుకోండి. ఒక ప్రకాశవంతమైనటువంటి, అవకాశాల తో నిండి ఉన్నటువంటి భవిష్యత్తు మీ కోసం వేచి ఉంది. మీలో ప్రతి ఒక్కరి లోనూ ప్రతిభ కు కొదువ లేదు. నా శుభాకాంక్షలు మీకు ఎప్పుడూ ఉంటాయి.

ఈ సంవత్సరం పన్నెండో తరగతి బోర్డుల కు హాజరు అయిన బ్యాచ్ ఇది వరకు ఎరుగని పరిస్థితులలో ఆ పని ని చేసింది.

గడచిన సంవత్సరం లో విద్య జగతి ఎన్నో మార్పుల ను చూసింది. అయినప్పటికి కూడా, వారు కొత్త సాధారణ స్థితి కి అలవాటు పడ్డారు, వారు వారి అత్యుత్తమ ప్రతిభ ను ప్రదర్శించారు. వారిని చూసి గర్వపడుతున్నాను ’’ అని ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో పేర్కొన్నారు.

 

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
1 in 3 US smartphone imports now made in India, China’s lead shrinks

Media Coverage

1 in 3 US smartphone imports now made in India, China’s lead shrinks
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 26 జూలై 2025
July 26, 2025

Citizens Appreciate PM Modi’s Vision of Transforming India & Strengthening Global Ties