టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ క్రీడల మహిళా టేబుల్ టెన్నిస్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణి భవీనా పటేల్‌కు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో-
“విశిష్ట క్రీడాకారిణి భవీనా పటేల్ కొత్త చరిత్ర సృష్టించారు! ఈ మేరకు ఆమె చారిత్రక రజత పతకాన్ని స్వదేశానికి సమర్పించారు. ఈ ఘనత సాధించిన ఆమెకు హృదయపూర్వక అభినందనలు. ఆమె స్ఫూర్తిదాయక జీవన గమనం.. భవిష్యత్తులో యువతను మరింతగా క్రీడలవైపు ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. #Paralympics”
The remarkable Bhavina Patel has scripted history! She brings home a historic Silver medal. Congratulations to her for it. Her life journey is motivating and will also draw more youngsters towards sports. #Paralympics
— Narendra Modi (@narendramodi) August 29, 2021