కొమొరోస్ యొక్క రాష్ట్రపతి గా శ్రీ అజాలీ అసోమానీ తిరిగి ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలిజేశారు.
భారతదేశం-కొమొరోస్ భాగస్వామ్యాన్ని, భారతదేశం-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని మరియు ‘విజన్ సాగర్’ ను మరింత బలపరచాలని తాను ఆశపడుతున్నట్లు కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశంలో -
‘‘శ్రీ అజాలీ అసోమానీ గారు, మీరు కొమొరోస్ యొక్క రాష్ట్రపతి గా తిరిగి ఎన్నికైన సందర్భం లో ఇవే హృదయపూర్వకమైన అభినందన లు. భారతదేశం-కొమొరోస్ భాగస్వామ్యాన్ని, భారతదేశం-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని మరియు ‘విజన్ సాగర్’ ను మరింత బలపరచాలని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
Heartiest congratulations @PR_AZALI on your re-election as the President of Comoros. Look forward to continue working together to further strengthen India-Comoros partnership, India-Africa partnership and ‘Vision Sagar.’
— Narendra Modi (@narendramodi) January 29, 2024