ఆసియా క్రీడల మహిళల ఫ్రీస్టయిల్ కుస్తీ 53 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“మహిళల ఫ్రీస్టయిల్ కుస్తీ 53 కిలోల విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్న ఒలీఅంతిమ్ పంఘాల్ @OlyAntimను అభినందిస్తున్నాను. ఆమె ప్రతిభను చూపి దేశం గర్విస్తోంది. ఈ క్రీడాతార మరింత ఉజ్వల ప్రకాశంతో స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations to @OlyAntim for clinching the Bronze Medal in Freestyle 53kg Women's Wrestling event. Our nation is proud of her. Keep shining, keep inspiring! pic.twitter.com/sLGGTHRI5b
— Narendra Modi (@narendramodi) October 5, 2023