‘‘India @100 సాధారణం గా ఉండకూడదు. ఈ 25 సంవత్సరాల కాలాన్ని ఒక యూనిట్ గాభావించి, మనం ఇప్పటి నుంచే ఒక దృష్టి కోణాన్నిఏర్పరచుకోవాలి. ఈ సంవత్సరం లో జరుపుకొనే ఉత్సవం చరిత్రాత్మకం గా ఉండాలి.’’
‘‘దేశం లోని సామాన్య ప్రజల జీవనం లో ఒక మార్పు అనేది రావాలి. వారి జీవనం సరళతరం కావాలి, మరి వారు ఈ కూడా అనుభూతిచెందేలా ఈ సహజత్వం ఉండాలి’’
స్వప్నం ద్వారా సంకల్పం మరియు సంకల్పం ద్వారా సిద్ధి వరకు సాగే సామాన్య మానవుని యాత్ర లో మనం ప్రతి మజిలీ లో అతని కి సహాయం చేయడం కోసం అతడి కి అందుబాటు లో ఉండాలి’’
‘‘మనం ప్రపంచం స్థాయి లో జరిగే కార్యకలాపాల ను అనుసరించలేకపోయిన పక్షం లో,అటువంటప్పుడు మన ప్రాధాన్యాల ను మరియు మనం ప్రత్యేక శ్రద్ధ ను వహించవలసిన రంగాలనునిర్ధారించుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఈ దార్శనికత ను మనస్సు లో పెట్టుకొనిమనం మన పథకాల ను మరియు పాలన సంబంధి నమూనాల ను అభివృద్ధి పరచుకోవలసిన అవసరం ఉంది’’
‘‘సమాజం యొక్క సామర్థ్యాన్ని పెంచిపోషించడం, సమాజ శక్తి ని బలపరచడం మరియు సమాజం యొక్కసామర్ధ్యాన్ని సమర్ధించడం అనేవి ప్రభుత్వ వ్యవస్థ యొక్క కర్తవ్యాలు అయి ఉన్నాయి’’
‘‘పాలన లో సంస్కరణ ను తీసుకు రావడం అనేది మన స్వాభావిక వైఖరి కావాలి’’
‘‘మన నిర్ణయాల లో ఎప్పటికీ ‘దేశ ప్రజల కే అగ్రతాంబూలం’ తాలూకు తక్షణ దర్శనం ఉండాలి’’
‘‘కొరత ఎదురైన కాలం లో తెర మీదకు వచ్చిన నిబంధన ల యొక్క మరియు మనస్తత్వంయొక్క ఆజ్ఞల కు మనం లోబడకూడదు, మనం సమృద్ధి తాలూకు ధోరణి ని అలవరచుకోవాలి’’
‘‘నేను రాజనీతియుక్త స్వభావాన్ని కలిగిన వాడిని కాదు, నా స్వాభావికమైనటువంటి మొగ్గు ప్రజానీతిపట్లనే ఉంది’’

సివిల్ సర్వీసెస్ డే ను పురస్కరించుకొని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో, ప్రజా పాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ఇచ్చేటటువంటి ప్రధాన మంత్రి తరఫు పురస్కారాల ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో కేంద్ర మంత్రి శ్రీ జితేంద్ర సింహ్, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి శ్రీ పి.కె. మిశ్రా, కేబినెట్ సెక్రట్రి శ్రీ రాజీవ్ గాబా తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘కర్మ యోగులు’ అందరికీ సివిల్ సర్వీస్ డే శుభాకాంక్షలు పలికారు. పాలన ను మెరుగు పరచడం కోసం, మరి అలాగే జ్ఞానాన్ని వెల్లడి చేయడం కోసం ఆయన ఒక సూచన ను చేస్తూ తన ఉపన్యాసాన్ని మొదలు పెట్టారు. అన్ని శిక్షణ అకాడమీ లు వారం వారీ గా ప్రక్రియ మరియు అవార్డు విజేత ల అనుభవాల ను వర్చువల్ మాధ్యమం ద్వారా శేర్ చేయవచ్చు అని ఆయన సలహా ను ఇచ్చారు. రెండోది, పురస్కారాల ను గెలుచుకొన్న పథకాల లో ఒక పథకాన్ని కొన్ని జిల్లాల లో అమలు చేయడం కోసం ఎంపిక చేసుకోవచ్చు, మరి రాబోయే సంవత్సరం లో సివిల్ సర్వీస్ డే నాడు అదే అనుభవాన్ని గురించి చర్చించవచ్చును అని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక 20-22 సంవత్సరాల నుంచి మొదట ముఖ్యమంత్రి గా, ఆ తరువాత ప్రధాన మంత్రి గా తాను ప్రభుత్వ ఉద్యోగుల తో సంభాషిస్తూ వస్తున్న సంగతి ని గుర్తు కు తెచ్చారు. అది తమ రెండు పక్షాల కు ఒకరి నుంచి మరొకరు నేర్చుకొనేందుకు అవకాశాన్ని ఇచ్చింది అని ఆయన అన్నారు. ఈ సంవత్సరం లో జరుపుకొంటున్న కార్యక్రమం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సంవత్సరం లో జరుగుతోంది అంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావించారు. ఇదివరకటి జిల్లా పాలకుల ను ఈ ప్రత్యేక సంవత్సరం లో జిల్లా కు ఆహ్వానించాలని ప్రస్తుత పరిపాలకుల కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది జిల్లా లో కొత్త శక్తి ని నింపుతుంది, గత కాలం లో సంపాదించిన అనుభవం అనేది జిల్లా పాలన దృష్ట్యా ఆహ్వానించదగినటువంటి చైతన్యాన్ని అందిస్తుంది అని ఆయన అన్నారు. అదే విధం గా రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఈ ప్రతిష్టాత్మక సంవత్సరం లో స్వాతంత్య్ర భారతదేశం ప్రస్థానం లో గణనీయం గా తోడ్పాటు ను అందించిన పాలక యంత్రాంగం ప్రముఖుల నుంచి ప్రయోజనాన్ని పొందేందుకు గాను రాష్ట్రానికి చెందినటువంటి పూర్వ చీఫ్ సెక్రట్రిల ను, కేబినెట్ సెక్రట్రిల ను రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆహ్వానించవచ్చును అని ఆయన పేర్కొన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్న సంవత్సరం లో సివిల్ సర్వీసు ను గౌరవించుకొనేందుకు ఇది ఒక సముచితమైన పద్ధతి కాగలదు అని ఆయన అన్నారు.

‘అమృత్ కాలం’ అంటే అది ఓ ఉత్సవాన్ని మాత్రమే జరుపుకోవడానికో లేక గతాన్ని ప్రశంసించడానికో కాదు, మరి 75వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరాని కి ప్రయాణించడం అనేది కేవలం సాధారణంగా మిగిలిపో కూడదు అని ప్రధాన మంత్రి అన్నారు. “India @100 అనేది సాధారణం కాజాలదు. ఈ 25 ఏళ్ళ కాలాన్ని ఒక యూనిటు గా చూడాలి, మరి మనం ఇప్పటి నుంచే ఒక దృష్టి కోణాన్నంటూ ఏర్పరచుకోవాలి. ఇది ఒక చరిత్రాత్మకమైన ఉత్సవం అవ్వాలి. ఇదే భావన తో ప్రతి ఒక్క జిల్లా ముందు కు సాగాలి. ప్రయాసల లో ఎటువంటి లోపం ఉండరాదు. 1947వ సంవత్సరం లో ఇదే రోజు న సర్ దార్ పటేల్ గారు తీసుకొన్న సంకల్పాలు మరియు నిర్దేశాల పట్ల మనల ను మనం మరొక్క సారి అంకితం చేసుకోవలసినటువంటి కాలం ఈ కాలం అని ప్రధాన మంత్రి అన్నారు.

మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఉన్నాం, మరి మన ఎదుట మూడు లక్ష్యాలు సుస్పష్టం గా ఉండాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ఒకటో లక్ష్యం ఏమిటి అంటే అది దేశం లోని సామాన్యుల జీవనం లో మార్పు అనేది రావాలి, వారి జీవనం లో సుగమత రావాలి, మరి ఆ సుగమత తాలూకు అనుభూతి ని వారు గ్రహించ గలగాలి కూడాను అనేదే. ప్రభుత్వం తో అయ్యే పనులను పూర్తి చేసుకోవడం లో సామాన్య ప్రజానీకం సంఘర్షణ చేసే అగత్యం ఎదురుకాకూడదు. వారికి ప్రయోజనాలు మరియు సేవ లు దక్కించుకోవడం లో ఎటువంటి ఇబ్బంది ఉండరాదు ఆయన వివరించారు. ‘‘సామాన్య మానవుడి స్వప్నాల ను సంకల్పం స్థాయి కి తీసుకుపోవడం అనేది వ్యవస్థ యొక్క బాధ్యతగా ఉన్నది. ఈ సంకల్పాన్ని సిద్ధి దశ కు చేర్చాలి. మరి ఇదే మన అందరి లక్ష్యం అవ్వాలి. కలగనడం ద్వారా సంకల్పాన్ని తీసుకోవడం, సంకల్పాన్నుంచి సిద్ధి వరకు సాగిపోయేటటువంటి ఈ యొక్క యాత్ర లో మనం ప్రతి మజిలీ లో వారి కి సహాయం చేయడం కోసం అందుబాటు లో ఉండాలి’’ అని ఆయన అన్నారు. ఇక రెండో లక్ష్యాన్ని గురించి చెప్పవలసి వస్తే, ఇవాళ మనం భారతదేశం లో ఏమి చేసినప్పటికీ, దానిని ప్రపంచం స్థాయి లో చేయాలి అనేదే కాలం కోరుకొంటున్న అంశం. ఒకవేళ మనం ప్రపంచం స్థాయి లో చోటు చేసుకొంటున్న కార్యకలాపాల ను అనుసరించ లేకపోయామా అంటే అప్పుడు మనకు మన ప్రాథమ్యాలను నిర్ధారించుకోవడం, మరి ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవలసినటువంటి రంగాల ను గురించి తెలుసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. ఈ విషయాన్ని మనస్సు లో పెట్టుకొని మనం మన పథకాల ను మరియు మన పాలన సంబంధి నమూనాల ను అభివృద్ధి పరచుకోవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. మన వ్యవస్థ మరియు నమూనా లు నియమిత వేగం తో సమకాలీనం అవుతూ ఉండాలి. మనం గత శతాబ్ది తాలూకు వ్యవస్థల తో నేటి కాలం లోని సవాళ్ళ ను ఎదుర్కోలేం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఇక మూడో విషయం ఏమిటంటారా, అది ‘‘ఒక విధం గా నేను ఇదివరకు చెప్పిన మాటల నే మరోసారి చెబుతున్నాను.. వ్యవస్థ లో మనం ఎక్కడ ఉన్నప్పటి కీ కూడాను, ఏ వ్యవస్థ లో నుంచి అయితే మనం వచ్చామో, దానిలో మన ముఖ్యమైన బాధ్యత ఏది అంటే అది దేశం యొక్క ఏకత మరియు అఖండత.. వీటిలో ఎటువంటి రాజీ కి తావు ఇవ్వనేకూడదు. స్థానికం గా తీసుకొనే నిర్ణయాలు అయినా సరే వాటిని ఇదే గీటురాయి పైన గీచి గమనించుకోవాలి. మనం తీసుకొనే ప్రతి ఒక్క నిర్ణయం తాలూకు మూల్యాంకనం దేశం యొక్క ఐకమత్యాని కి, దేశం యొక్క సమగ్రత కు బలాన్ని ఇవ్వగలిగే ఆ నిర్ణయం యొక్క సామర్థ్యం తాలూకు ఆధారం గానే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి. మన నిర్ణయాలలో సదా ‘దేశ ప్రజల కు అగ్ర తాంబూలం’ (నేశన్ ఫస్ట్) అనే తక్షణ దర్శనం ఛాయ పొడగట్టాలి అని ఆయన అన్నారు.

భారతదేశం యొక్క ఘనమైన సంస్కృతి యొక్క విశిష్టత ఏమిటి అంటే అది మన దేశం రాజ వ్యవస్థ లతో రూపొందలేదు, మన దేశం రాజ సింహాసనాల తో తయారు కాలేదు అనేదే. వేల కొద్దీ సంవత్సరాలదైన మన సంప్రదాయం జన సామాన్యం యొక్క సామర్థ్యాన్ని వెంట తీసుకు సాగిపోయేటటువంటిదిగా ఉంది. ఇది మన ప్రాచీన జ్ఞానాన్ని కాపాడుతూనే పరివర్తన మరియు ఆధునికత ను స్వీకరించాలి అనేటటువంటి దేశం యొక్క భావన ను సైతం చాటుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. సమాజం యొక్క సామర్ధ్యాన్ని పెంచి పోషించడం, సమాజం యొక్క శక్తి ని బలపరచడం, మరి అలాగే సమాజం యొక్క సామర్థ్యాన్ని సమర్ధించడం.. ఇవే ప్రభుత్వ వ్యవస్థ యొక్క కర్తవ్యాలు అని ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు. స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్ లో, వ్యవసాయం లో తెర మీద కు వస్తున్న కొత్త ఆవిష్కరణ ల తాలూకు ఉదాహరణల ను గురించి ఆయన ఉదాహరించారు. ప్రోత్సాహాన్ని అందించే వారు గా, సహాయకులు గా మీ పాత్రల ను పోషించండి అంటూ పరిపాలకుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

టైపిస్టు కు మరియు సితార్ వాదకుని కి మధ్య తేడా ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఒక పరిశీలించిన జీవనాన్ని, కలలు మరియు ఉత్సాహం తోను ప్రయోజనం తోను కూడిన జీవనాన్ని జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. ‘‘నేను ప్రతి క్షణం జీవించాలి అని కోరుకొంటున్నా; తద్ద్వారా నేను సేవ చేయాలి మరి ఇతరులకు సాయపడాలి’’ అని ఆయన వివరించారు. పలువురు నడవడం తో అరిగిపోయిన దారిలోనే మనమూ నడవడం కాకుండా వేరే దారి ని ఎన్నుకోండి, మూస కు మించిన ఆలోచనల ను చేయండి అంటూ అధికారుల కు శ్రీ నరేంద్ర మోదీ ఉత్తేజపరిచారు. పాలన లో సంస్కరణలను తీసుకురావాలి అది ఎలాగ అనే దాని పట్ల మన స్వాభావికమైన మొగ్గు ఉండాలి, పాలన పరమైన సంస్కరణ లు అనేవి ప్రయోగాత్మకం గాను, దేశం యొక్క మరియు కాలం యొక్క అవసరాల కు తగినవి గా ఉండాలి అని ఆయన చెప్పారు. కాలం వ్యవహారదూరమైన చట్టాల, పాటించవలసిన నియమాల సంఖ్య ను కుదించడం.. ఇవి తన అతి ముఖ్యమైన పనుల లో ఒకటి అని ఆయన తెలియజేశారు. మనం ఒత్తిడి కి లోనైనప్పుడు మాత్రమే మారకూడదు, మనం ఫలానా మార్పు జరుగుతుంది అనే సూచన అందడాని కంటే ముందే సంస్కరించే ప్రయత్నాన్ని చేయాలి అని ప్రధాన మంత్రి అన్నారు. కొరత బాధించిన కాలం లో చోటుచేసుకొన్న నిబంధనల మరియు మనస్తత్వం ల వల్ల మనం పాలింపబడకూడదు. మనం సమృద్ధి తాలూకు ప్రవృత్తి ని కలిగివుండాలి. అదే విధం గా, మనం సవాళ్ళ కు ప్రతిస్పందించడానికి బదులు గా అంచనా కట్టాలి అని ఆయన అన్నారు. ‘‘గడచిన 8 సంవత్సరాల లో దేశం లో ఎన్నో పెద్ద కార్యాలు జరిగాయి. వాటిలో అనేక ప్రచార ఉద్యమాలు ఎటువంటివి అంటే వాటి మూలం లో నడవడిక పరమైన పరివర్తన ఉంది’’ అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. నేను రాజనీతియుక్త స్వభావాన్ని కలిగిన వాడిని కాను, నేను జన నీతి యొక్క స్వభావాన్ని కలిగిన వాడిని అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి చివర గా నిజ జీవనం లో మహత్వపూర్ణ సంస్కరణల ను అవలంబించాలి అని అధికారుల ను అభ్యర్థించారు. ఉదాహరణ కు, పరిశుభ్రత కు, జిఇఎమ్ లేదా యుపిఐ ఉపయోగాని కి వారి జీవనం లో చోటు ఉందా లేక లేదా అనేది గమనించుకోవాలి అని ఆయన అన్నారు.

సామాన్య పౌరుల సంక్షేమం కోసం జిల్లా లు/కార్యాచరణ విభాగాలు మరియు కేంద్రీయ / రాష్ట్రాల సంస్థలు అమలు పరచినటువంటి అసాధారణమైన కార్యాల ను మరియు కొత్త కొత్త కార్యక్రమాల ను గుర్తించాలి అనే ఉద్దేశ్యం తో ప్రజా పాలన లో ప్రావీణ్యాని కి గాను ప్రధాన మంత్రి తరఫున ప్రకటించేటటువంటి పురస్కారాల ను ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తించిన ప్రాథమ్య కార్యక్రమాలు మరియు నూతన ఆవిష్కరణల ను ప్రభావవంతమైన రీతి లో అమలు పరచినందుకు కూడా ఈ పురస్కారాల ను ప్రదానం చేయడం జరుగుతున్నది.

ఈ కింద ప్రస్తావించినటువంటి అయిదు గుర్తించిన ప్రాథమ్య కార్యక్రమాల లో చేసిన మార్గదర్శక ప్రాయమైన కార్యాల కు గాను సివిల్ సర్వీసెస్ డే 2022 సందర్భం లో పురస్కారాల ను ప్రదానం చేయడం జరుగుతున్నది: (1) పోషణ్ అభియాన్ లో ‘‘జన్ భాగీదారీ’’ లేదా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, (2) ఖేలో ఇండియా పథకం యొక్క మాధ్యమం ద్వారా క్రీడలు మరియు వెల్ నెస్ లో శ్రేష్ఠత్వాన్ని ప్రోత్సహించడం, (3) పిఎమ్ స్వనిధి యోజన లో డిజిటల్ పేమెంట్స్ మరియు సుపరిపాలన, (4) ఒక జిల్లా, ఒక ఉత్పత్తి పథకం యొక్క మాధ్యమం ద్వారా సమగ్ర అభివృద్ధి, (5) మానవ ప్రమేయానికి తావు లేకుండానే సేవల ను ఆరంభం నుంచి అంతం వరకు నిరంతరాయంగా ప్రజల కు అందించడం.

ఈ సంవత్సరం లో గుర్తించిన అయిదు ప్రాథమ్య కార్యక్రమాలు మరియు ప్రజా పాలన/సేవ ల అందజేత మొదలైన రంగాల లో నూతన ఆవిష్కరణల కు గాను మొత్తం 16 పురస్కారాల ను ఇవ్వడం జరుగుతున్నది.

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi