పూర్వ రాష్ట్రపతి ‘భారత్ రత్న’ శ్రీ ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘ ‘భారత్ రత్న’ శ్రీ ప్రణబ్ ముఖర్జీ మరణించడం పట్ల భారతదేశం దు:ఖిస్తోంది. మన దేశం యొక్క అభివృద్ధి తాలూకు ప్రక్షేప పథం పైన ఆయన వేసిన ముద్ర మరపురానటువంటిది. ఒక ఉత్తమ పండితుడు, ఒక ఉన్నత స్థాయి రాజనీతిజ్ఞుడైన ఆయన సమాజం లో అన్ని వర్గాల, అన్ని రాజకీయ పక్షాల ప్రశంసల కు పాత్రుడయ్యారు.

దశాబ్దాల పాటు విస్తరించిన ఆయన రాజకీయ వృత్తి జీవనం లో శ్రీ ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిత్వ శాఖ లోను, వ్యూహాత్మకమైనటువంటి మంత్రిత్వ శాఖల లోను చిరస్థాయి గా నిలచిపోయే తోడ్పాటుల ను అందించారు. పార్లమెంట్ లో ఆయన ఒక ఉత్కృష్ట సభ్యుని గా వ్యవహరించారు; ఆయన ఎల్లప్పుడూ ఎంతో చక్కగా సన్నద్ధుడై వచ్చే వారు, అత్యంత స్పష్టం గాను, సమయ స్ఫూర్తి తోను మాట్లాడే వారు.

భారతదేశం యొక్క రాష్ట్రపతి గా శ్రీ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్ ను సామాన్య పౌరుల కు మరింత ఎక్కువగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆయన రాష్ట్రపతి గృహాన్ని జ్ఞానం, నూతన ఆవిష్కరణ, సంస్కృతి, విజ్ఞానశాస్త్రం, ఇంకా సాహిత్యాల కు ఒక కేంద్రం వలె తీర్చిదిద్దారు. కీలకమైన విధాన సంబంధిత అంశాల లో ఆయన ఇచ్చిన వివేకపూర్ణమైన సలహాలను నేను ఎన్నటికీ మరువలేను.

2014 వ సంవత్సరం లో దిల్లీ కి నేను కొత్త వాడి ని. ఒకటో రోజు నుండే శ్రీ ప్రణబ్ ముఖర్జీ యొక్క మార్గదర్శనం, ఆయన అండ, ఇంకా ఆయన ఆశీస్సులు లభించడం నాకు పరమానందాన్ని ఇచ్చింది. ఆయన తో నేను జరిపిన భేటీల ను నేను ఎల్లప్పటికీ నా మనసు లో అట్టిపెట్టుకొంటాను. ఆయన కుటుంబానికి, భారతదేశం అంతటా విస్తరించి ఉన్న ఆయన మిత్రులకు, ఆయన ప్రశంసకులకు మరియు ఆయన మద్దతుదారులకు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి. ’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian Markets Outperformed With Positive Returns For 9th Consecutive Year In 2024

Media Coverage

Indian Markets Outperformed With Positive Returns For 9th Consecutive Year In 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 డిసెంబర్ 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India