విద్యుదాఘాతం కారణం గా ఉత్తరాఖండ్ లోని చమోలీ లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు కావాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు; ఈ ఘటన లో బాధితుల కు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం చేతనైన అన్ని విధాలు గాను సాయాన్ని అందిస్తోందని ఆయన వెల్లడించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘అత్యంత బాధాకరం. ఉత్తరాఖండ్ లోని చమోలీ లో జరిగిన దుర్ఘటన తో అత్యంత దుఃఖం కలిగింది. శోకం లో మునిగిన కుటుంబ సభ్యుల కు నేను నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ దుర్ఘటన లో క్షతగాత్రులు అందరూ త్వరిత గతి న స్వస్థులు అవ్వాలని కోరుకొంటున్నాను. బాధితుల కు రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం చేతనైన అన్ని విధాలు గాను సాయపడడం లో తలమునకలు గా ఉంది: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని పేర్కొంది.
अत्यंत पीड़ादायक! उत्तराखंड के चमोली में हुए हादसे से बहुत दुख हुआ है। शोकाकुल परिजनों के प्रति मैं अपनी गहरी संवेदना प्रकट करने के साथ ही सभी घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है: PM…
— PMO India (@PMOIndia) July 19, 2023