సీనియర్ లీడర్ శ్రీ శ్యాందేవ్ రాయ్ చౌధరి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. శ్రీ శ్యాందేవ్ రాయ్ చౌధరి జీవించి ఉన్నంత కాలమూ ప్రజలకు సేవ చేయడానికే అంకితం కావడంతో పాటు కాశీ అభివృద్ధికి కూడా సార్థక సేవను అందించారని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘శ్యాందేవ్ రాయ్ చౌధరి గారు తన జీవనాన్నంతటినీ ప్రజా సేవకే సమర్పించిన భాజపా వరిష్ఠ నేత. ఆయన మనను వీడి వెళ్లడంతో అత్యంత దు:ఖం కలిగింది. ఆయనను మనమందరం స్నేహ భావంతో ‘దాదా’ అని పిలిచే వాళ్లం. పార్టీ కి నారు-నీరు పోయడంలో ఆయన ముఖ్య తోడ్పాటును అందించారు. అంతే కాదు, కాశీ అభివృద్ధికి పూర్తి అంకితభావంతో నిమగ్నమయ్యారు. ఆయన నిష్క్రమణ కాశీతో పాటు యావత్తు రాజకీయ జగతికి పూడ్చ లేనటువంటి లోటును మిగిల్చింది. ఈ శోక ఘడియలో ఆయన ఆత్మీయులకు, ఆయనను అభిమానించే వారికి ఆ పరమాత్మ ధైర్యాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓమ్ శాంతి.’’
"जनसेवा में जीवनपर्यंत समर्पित रहे भाजपा के वरिष्ठ नेता श्यामदेव राय चौधरी जी के निधन से अत्यंत दुख हुआ है। स्नेह भाव से हम सभी उन्हें 'दादा' कहते थे। उन्होंने ना केवल संगठन को सींचने और संवारने में अहम योगदान दिया, बल्कि काशी के विकास के लिए भी वे पूरे समर्पण भाव से जुटे रहे। उनका जाना काशी के साथ-साथ पूरे राजनीतिक जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी में ईश्वर उनके परिजनों और समर्थकों को संबल प्रदान करे। ओम शांति!"
जनसेवा में जीवनपर्यंत समर्पित रहे भाजपा के वरिष्ठ नेता श्यामदेव राय चौधरी जी के निधन से अत्यंत दुख हुआ है। स्नेह भाव से हम सभी उन्हें 'दादा' कहते थे। उन्होंने ना केवल संगठन को सींचने और संवारने में अहम योगदान दिया, बल्कि काशी के विकास के लिए भी वे पूरे समर्पण भाव से जुटे रहे।… pic.twitter.com/trRbl7AK0z
— Narendra Modi (@narendramodi) November 26, 2024