కాశీ విద్వత్ పరిషద్ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాం యత్న శుక్లా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ శుక్లా గారి మరణం విద్యా జగతి కి, ఆధ్యాత్మిక జగతి కి మరియు సాంస్కృతిక జగతి కి తీరని లోటు అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కాశీ విద్వత్ పరిషద్ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాం యత్న శుక్లా మృతి విద్య, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక జగతి కి పూడ్చలేనటువంటి లోటు. ఆయన సంస్కృత భాష తో పాటు సాంప్రదాయక శాస్త్రాల సంరక్షణ లో మహత్వపూర్ణమైనటువంటి భూమిక ను నిర్వహించారు. ఈ శోక ఘడియ లో ఆయన సంబంధికుల కు మరియు ఆయన యొక్క మిత్రుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
काशी विद्वत्परिषद् के अध्यक्ष प्रो. रामयत्न शुक्ल जी का निधन शैक्षणिक, आध्यात्मिक और सांस्कृतिक जगत के लिए एक अपूरणीय क्षति है। उन्होंने संस्कृत भाषा और पारंपरिक शास्त्रों के संरक्षण में महत्वपूर्ण भूमिका निभाई। शोक की इस घड़ी में उनके परिजनों के प्रति मेरी संवेदनाएं। ओम शांति! pic.twitter.com/76hcBKZKON
— Narendra Modi (@narendramodi) September 20, 2022