డాక్టర్ పియరీ సిల్వాన్ ఫిల్యూజట్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సంస్కృతాధ్యయనానికి ప్రాచుర్యం కల్పించడంలోనూ.. ముఖ్యంగా సాహిత్యం, వ్యాకరణ రంగాల్లోనూ ఆయన చేసిన కృషి ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు:
“సంస్కృతాధ్యయనానికి ప్రాచుర్యం కల్పించడంలోనూ.. ముఖ్యంగా సాహిత్యం, వ్యాకరణ రంగాల్లోనూ డా. పియరీ సిల్వాన్ ఫిల్యూజట్ కృషి అజరామరమైనది. భారత్, భారతీయ సంస్కృతులతో ఆయనకు విశేషమైన అనుబంధం ఉంది. ఆయన మృతి బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకూ, స్నేహితులకూ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”.
Dr. Pierre-Sylvain Filliozat will be remembered for his exemplary efforts to popularise Sanskrit studies, especially in the field of literature and grammar. He was deeply connected with India and Indian culture. Pained by his passing away. My thoughts are with his family and…
— Narendra Modi (@narendramodi) December 31, 2024