హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ఫ్యాక్టరీ లో జరిగిన దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘హిమాచల్ ప్రదేశ్ లోని ఊనా లో ఒక ఫ్యాక్టరీ లో జరిగిన దుర్ఘటన దుఃఖదాయకం గా ఉంది. ఈ దుర్ఘటన లో తమ ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ఇదే నా ప్రగాఢ సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని నేను కోరుకొంటున్నాను: ప్రధాన మంత్రి’’
"హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ఫ్యాక్టరీ లో జరగిన దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున అందజేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.