అఫ్ గానిస్తాన్ లో సంభవించిన భూకంపం లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘అఫ్ గానిస్తాన్ లో ఈ రోజు న వినాశకారి భూకంపం సంభవించిందన్న వార్త తెలిసి ప్రగాఢ దుఃఖం కలిగింది. అమూల్యమైనటువంటి ప్రాణాలకు నష్టం వాటిల్లినందుకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.
ఈ కఠిన పరిస్థితి లో అఫ్ గానిస్తాన్ ప్రజల వెన్నంటి భారతదేశం నిలవడం తో పాటుగా చేతనైన అన్ని రకాలు గాను విపత్తు సంబంధిత సహాయక సామగ్రి ని శీఘ్ర గతి న అందించడాని కి కూడా తయారు గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
Deeply saddened at the news of the devastating earthquake in Afghanistan today. My deepest condolences on loss of precious lives.
— Narendra Modi (@narendramodi) June 22, 2022
India stands by the people of Afghanistan in their difficult times and is ready to provide all possible disaster relief material at the earliest.