తెలంగాణలోని నాగర్ కర్నూల్ లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు 2 లక్షల రూపాయలు చొప్పున,గాయపడిన వారికి 50,000 రూపాయలు చొప్పున ప్రధానమంత్రి ఎక్స్-గ్రేషియా కూడా ప్రకటించారు.
ఈ విషయాన్ని, సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ట్వీట్ పేర్కొంది.
"తెలంగాణలోని నాగర్ కర్నూల్ లో జరిగిన ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకుంటారు. మరణించిన వారి సమీప బంధువులకు 2 లక్షల రూపాయలు చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయలు చొప్పున పి.ఎమ్.ఎన్.ఆర్.ఎఫ్. నుండి ఇవ్వబడుతుంది : ప్రధానమంత్రి మోదీ"
Condolences to those who lost their loved ones in an accident in Nagarkurnool, Telangana. May the injured recover at the earliest. From PMNRF, an ex-gratia of Rs. 2 lakh each will be given to the next of kin of the deceased and Rs. 50,000 would be given to the injured: PM Modi
— PMO India (@PMOIndia) July 23, 2021
ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున, అలాగే గాయపడిన ప్రతి ఒక్కరికీ 50000 రూపాయల చొప్పున నష్ట పరిహారం ప్రకటిస్తున్నాను: ప్రధాన మంత్రి నరేంద్ర మోడి
— PMO India (@PMOIndia) July 23, 2021