హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో ఓ ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రాణాలను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
పిఎమ్ ఒ తరఫున వరుస ట్వీట్ లలో ప్రధాన మంత్రి ఈ కింది విధం గా పేర్కొన్నారు:
‘‘ హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో కొండచరియలు విరిగిపడ్డ కారణం గా జరిగిన ప్రమాదం అత్యంత దు:ఖదాయకం గా ఉంది. ఈ ప్రమాదం లో ప్రాణాల ను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికుల కు ఇదే నా ప్రగాఢ సంతాపం. దుర్ఘటన లో గాయపడ్డ వారికి చికిత్స ను అందించేందుకు అన్ని ఏర్పాటుల ను చేయడం జరుగుతోంది. వారు త్వరగా కోలుకోవాలి అని నేను కోరుకొంటున్నాను: PM @narendramodi
హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లో సంభవించిన ఓ ప్రమాదం లో ప్రాణాల ను కోల్పోయిన వారికి ఒక్కొక్కరి కి 2 లక్షల రూపాయల వంతున పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం గా వారి దగ్గరి సంబంధికుల కు ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది: PM @narendramodi ’’
हिमाचल प्रदेश के किन्नौर में भूस्खलन से हुआ हादसा अत्यंत दुखद है। इसमें जान गंवाने वाले लोगों के परिजनों के प्रति मेरी हार्दिक संवेदनाएं। दुर्घटना में घायल हुए लोगों के इलाज की पूरी व्यवस्था की जा रही है। मैं उनके शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 25, 2021