గుజరాత్ లోని వడోదర లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మానసిక క్షోభ నున వ్యక్తం చేసి, సంతాపాన్ని తెలియజేశారు. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘వడోదర జిల్లా లో రోడ్డు ప్రమాదం జరిగిన కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు వ్యథ కు లోనయ్యాను. ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలోనే పున:స్వస్థులు అగుదురు గాక. మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.
Anguished by the loss of lives due to a road accident in Vadodara district. Condolences to the bereaved families. May the injured recover soon. Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Rs. 50,000 would be given to the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 4, 2022