మధ్య ప్రదేశ్ లోని డిండోరీ జిల్లా లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు కావాలని శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. వారి కి ఈ కఠిన కాలం లో సంయమనాన్ని ఆ ఈశ్వరుడు అనుగ్రహించు గాక. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా తిరిగి స్వస్థులు అవ్వాలని నేను కోరుకొంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం బాధితుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని అందించడం లో తలమునుకలుగా ఉంది: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని తెలిపింది.
मध्य प्रदेश के डिंडोरी में हुई सड़क दुर्घटना अत्यंत दुखद है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस कठिन समय में संबल प्रदान करे। इसके साथ ही मैं सभी घायल लोगों के जल्द स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव…
— PMO India (@PMOIndia) February 29, 2024