ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో ఒక కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో చనిపోయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్నిప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఈ దుర్ఘటనలో మృతుల దగ్గరి సంబంధికులకు 2 లక్షల రూపాయల వంతున, గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్- గ్రేషియాను కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశంలో -
‘‘అనకాపల్లి లో ఒక కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణ నష్టం సంభవించడం నాకు వేదన కలిగించింది. ప్రియతములను కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాను. మృతుల దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల వంతున, గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఎక్స్ గ్రేషియాను ఇవ్వడం జరుగుతుంది. : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)’’.
Pained by the loss of lives due to a mishap at a factory in Anakapalle. Condolences to those who lost their near and dear ones. May the injured recover soon. An ex-gratia of Rs. 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs.…
— PMO India (@PMOIndia) August 21, 2024