భూకంపం కారణం గా టర్కీ లో ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
టర్కీ అధ్యక్షుడు చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,
‘‘భూకంపం వల్ల టర్కీ లో ప్రాణనష్టం మరియు సంపత్తి నష్టం జరిగిందని తెలిసి బాధ పడ్డాను. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలో పునఃస్వస్థులు అగుదురుగాక. టర్కీ ప్రజల కు భారతదేశం వెన్నంటి నిలబడడమే కాకుండా ఈ విషాదాన్నుండి కోలుకోవడాని కి సాధ్యమైనైన అన్ని విధాలు గా సహాయపడడానికి సిద్ధం గా ఉంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Anguished by the loss of lives and damage of property due to the Earthquake in Turkey. Condolences to the bereaved families. May the injured recover soon. India stands in solidarity with the people of Turkey and is ready to offer all possible assistance to cope with this tragedy. https://t.co/vYYJWiEjDQ
— Narendra Modi (@narendramodi) February 6, 2023